IPL 2026: రాణించిన గిల్, బట్లర్.. లక్నోపై గుజరాత్ విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులే చేసింది.
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. గుజరాత్ బ్యాటర్లు గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులే చేసింది. 165 పరుగుల టార్గెట్ ను గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ (56), బట్లర్ (60) అర్థ శతకాలతో చెలరేగారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో జట్టులో బ్యాటర్లు తడబడ్డారు. మార్క్రమ్ 30, మార్ష్ 11, ముకుల్ చౌదరి 18 పరుగులు చేశారు. ఎవరూ దూకుడుగా ఆడలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో చెలరేగాడు. అశోక్ శర్మ 2 వికెట్లు తీశాడు. సిరాజ్, రబాడ చెరో వికెట్ తీశారు.
