Dish Smart TV : డిష్ టీవీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీలు.. DTH, OTT కంటెంట్ ఒకేచోట.. ధర జస్ట్ ఎంతంటే?

Dish Smart TV : డిష్ టీవీ కొత్త VZY స్మార్ట్ టీవీ సిరీస్‌ను రిలీజ్ చేసింది. OTT, DTH సర్వీసులతో స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Dish Smart TV : డిష్ టీవీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీలు.. DTH, OTT కంటెంట్ ఒకేచోట.. ధర జస్ట్ ఎంతంటే?

Dish Smart TV

Updated On : September 9, 2025 / 7:57 PM IST

Dish Smart TV : కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ డిష్ టీవీ స్మార్ట్ టీవీ విభాగంలోకి ప్రవేశించింది. భారత మార్కెట్లో కొత్త VYZ సిరీస్‌ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది.
ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు DTH, OTT కంటెంట్ రెండింటినీ అందిస్తాయి.

స్పెషల్ సెట్-టాప్ బాక్స్ అవసరమే ఉండదు. ట్రెడేషనల్ డీటీహెచ్ సర్వీసుల విషయంలో (Dish Smart TV) వినియోగదారులు ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో కంపెనీ కొత్త స్మార్ట్ టీవీని డీటీహెచ్, ఓటీటీ ఇంటిగ్రేషన్ సర్వీసును అందిస్తోంది.

డిష్ టీవీ స్మార్ట్ టీవీ ధర, వేరియంట్లు :
VYZ (Vibe, Zone You) స్మార్ట్ టీవీ సిరీస్ HD, 4K UHD (అల్ట్రా HD) రిజల్యూషన్ డిస్ ప్లేలతో లభిస్తుంది. కంపెనీ 32-అంగుళాలు, 43-అంగుళాలు, 55-అంగుళాల స్క్రీన్లతో మోడళ్లను రిలీజ్ చేసంది. ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.12వేల నుంచి రూ.45వేల వరకు ఉన్నాయి.

ఈ సిరీస్ ప్రస్తుతం గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. డిష్ టీవీ రాబోయే 18 నెలల నుంచి 24 నెలల్లో సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.

Read Also : Vivo X300 Pro : కొత్త వివో X300 ప్రో వచ్చేస్తోందోచ్.. భారత్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు లీక్..

డిష్ టీవీ స్మార్ట్ టీవీ కీలక ఫీచర్లు :
డిష్ టీవీ కొత్త స్మార్ట్ టీవీ లైనప్‌లో DTH, OTT కంటెంట్‌ను ఇంటిగ్రేట్ చేసింది. డిష్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయగలరు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తమకు ఇష్టమైన OTT యాప్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

OTT కంటెంట్ కోసం స్పెషల్ సబ్‌స్క్రిప్షన్‌లు అవసరమైనా స్మార్ట్ టీవీతో DTH కనెక్షన్ పొందవచ్చు. 32-అంగుళాల మోడల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే, భారీ 4K UHD రిజల్యూషన్ తో మిగిలిన రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది.

డిష్ టీవీ స్మార్ట్ టీవీ సేల్ :
నివేదికల ప్రకారం.. కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి అందుబాటులో ఉండనుంది. DTH సర్వీసులతో పాటు, డిష్ టీవీ వాచో OTT ప్లాట్‌ఫామ్‌ను కూడా అందిస్తుంది. ఈ సిరీస్‌లోని టీవీలలో ఓటీటీ ప్రీ-ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.