Vivo X300 Pro : కొత్త వివో X300 ప్రో వచ్చేస్తోందోచ్.. భారత్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు లీక్..

Vivo X300 Pro : వివో నుంచి సరికొత్త ప్రో సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందుగానే స్పెషిఫికేషన్లు, ధర, ఇతర వివరాలు లీక్ అయ్యాయి.

Vivo X300 Pro : కొత్త వివో X300 ప్రో వచ్చేస్తోందోచ్.. భారత్ లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు లీక్..

Vivo X300 Pro India

Updated On : September 9, 2025 / 7:41 PM IST

Vivo X300 Pro Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. వివో నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ అతి త్వరలో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వివో X300 ప్రోను వివో X300 తో పాటు లాంచ్ చేయనుంది.

కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌లకు (Vivo X300 Pro) సంబంధించి వివరాలను రివీల్ చేసింది. డిస్ ప్లే, డిజైన్, కెమెరా స్పెసిఫికేషన్లు వంటి కీలక వివరాలను కూడా వెల్లడించింది. అయితే, భారత మార్కెట్లో లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ వివో X300 ప్రోకు సంబంధించి ఫీచర్లు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..

వివో X300 సిరీస్ స్పెసిఫికేషన్లు :
నివేదికల ప్రకారం.. వివో X300 ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే స్లిమ్, యూనిఫాం బెజెల్స్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్లు సన్నని పాయింట్ల వద్ద 7mm పొందుతాయి. గత వెర్షన్ల కన్నా సన్నగా ఉంటాయి. ఈ వివో ఫోన్ ప్రొఫైల్స్ 8mmకి దగ్గరగా ఉంటాయి. రౌండెడ్ కార్నర్ తో బంప్‌ను పొందుతుందని నివేదిక సూచించింది.

Read Also : Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర కేవలం రూ. 18వేల లోపు మాత్రమే.. డోంట్ మిస్..!

కెమెరా విషయానికి వస్తే.. వివో, జైస్ భాగస్వామ్యంతో వివో X300, వివో X300 ప్రో రెండూ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. వివో X300 ఫోన్ 200MP జైస్ మెయిన్ కెమెరాతో పాటు 50MP జైస్ APO సూపర్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను పొందుతుంది.

సోనీ కస్టమ్ LYT-602 సెన్సార్ ద్వారా పవర్ పొందుతుంది. మరోవైపు, వివో X300 ప్రోలో 200MP జీస్ HPB థానోస్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ మరియు సోనీ LYT-828 50MP ప్రధాన కెమెరా లభిస్తాయని చెబుతున్నారు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వివో X300 ప్రో ఫోన్ X930 కోర్, ఇమ్మోర్టాలిస్-డ్రేజ్ జీపీయూతో మీడియాటెక్ డైమన్షిటీ 9500 చిప్‌సెట్‌ను పొందవచ్చు. 7,000mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వివో X300 ప్రో భారత్ లాంచ్ టైమ్‌లైన్, ధర :
నివేదికల ప్రకారం.. భారత మార్కెట్లో వివో X300 ప్రో ధర దాదాపు రూ.99,999 ఉండొచ్చు. గత లాంచ్‌ల ఆధారంగా వివో X300, వివో X300 ప్రో అక్టోబర్‌లో లాంచ్ కావచ్చు. అయితే, కంపెనీ ఎలాంటి వివరాలను ధృవీకరించలేదు.