Oppo Holi Offer : ఒప్పో హోలీ ధమాకా! టాప్ OPPO ఫోన్లపై ఖతర్నాక్ ఆఫర్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI
Oppo Holi Offer: ఒప్పో హోలీ ఆఫర్ అదిరింది. ఈ టాప్ ఒప్పో ఫోన్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో పాటు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Oppo Holi Offer
- ఒప్పో ఫోన్లపై హోలీ అద్భుతమైన ఆఫర్లు
- టాప్ ఒప్పో ఫోన్లపై ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్
- 24 నెలల వరకు ఫ్రీ ఈఎంఐ ఆప్షన్
- బ్యాంకు ఆఫర్లతో మరిన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్లు
Oppo Holi Offer : ఒప్పో అభిమానులకు పండగే. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఒప్పో రెనో 15, ఒప్పో ఫైండ్ X9 ఫోన్లపై హోలీ ఆఫర్ అందిస్తోంది. ఈ సేల్ సందర్భంగా ఈ రెండు ఒప్పో ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
నో కాస్ట్ ఈఎంఐతో పాటు కొనుగోలుదారులు సబ్సిడీలను కూడా పొందవచ్చు. హోలీ పండగ సందర్భంగా ఒప్పో ఈ స్పెషల్ డీల్‌ను ప్రకటించింది. ఒప్పో నుంచి కొత్తగా లాంచ్ అయిన రెనో, ఫైండ్ ఎక్స్ సిరీస్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు.
24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ :
ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐలు, రాయితీలను అందిస్తాయి. ఈ ఫోన్లు గరిష్టంగా 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తాయి. కొన్ని క్రెడిట్ కార్డులు 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తాయి. ఒప్పో రెనో 15 ప్రో ఫోన్ 256GB, 512GB వేరియంట్లు గరిష్టంగా 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు.
అన్ని ఒప్పో రెనో 15 మోడళ్లు 15 నెలల ఫ్రీ ఈఎంఐ ఆఫర్‌కు అర్హులు. అలాగే, ఒప్పో ఫైండ్ X9 కొనుగోలు చేస్తే 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే, ఒప్పో A6, A6 ప్రోలకు వరుసగా 6 నెలలు లేదా 8 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు పొందవచ్చు.
Read Also : PM Kisan 22nd Installment : పీఎం కిసాన్ 22వ విడత రిలీజ్ డేట్ ఫిక్స్? హోలీకి ముందే రైతుల ఖాతాల్లో రూ. 2వేలు?
బ్యాంకు ఆఫర్లతో క్యాష్ బ్యాక్ ఆఫర్లు :
ఈ ఒప్పో ఫోన్లు కొనుగోలు చేస్తే 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎస్బీఐ, యాక్సస్, బ్యాంకు ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు, డీబీఎస్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, కోటాక్ మహీంద్రా, యశ్ బ్యాంకు కార్డులతో అన్నీ క్యాష్‌బ్యాక్ ప్రమోషన్‌కు అర్హత పొందవచ్చు. యూపీఐ లావాదేవీతో ఈ ఒప్పో ఫోన్లపై 10శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఒప్పో రెనో 15 ప్రో మినీ ప్రారంభ ధర రూ. 53,999కు లభిస్తుంది. ఒప్పో రెనో 15 ధర రూ. 41,399కు పొందవచ్చు. ఈ సిరీస్‌లో, ఒప్పో రెనో 15 50MP కెమెరాతో రాగా ప్రో మినీ 200MP కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్లు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తాయి.
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ ధర రూ. 69,499కు లభిస్తుంది. ఈ ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోన్ 6.59-అంగుళాల 120Hz అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i స్క్రీన్కు ప్రొటెక్షన్ అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది. 7025mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అందిస్తుంది.
