Waterproof Phones : నీళ్లు, రంగు పడినా డోంట్ కేర్ : రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు.. ఏ ఫోన్ కొంటారో మీఇష్టం!
Waterproof Phones : వర్షాకాలమైనా లేదా ఏ సీజన్ అయినా మీ ఫోన్ నీళ్లలో తడిస్తే పాడైపోతుందనే భయం అక్కర్లేదు. రూ. 15వేల లోపు ధరలో టాప్ 5 వాటర్ ప్రూఫ్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి. ఏ ఫోన్ ధర ఎంతంటే?
Top 5 waterproof phones
- రూ. 15వేల లోపు ధరలో వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు
- మీ ఫోన్ వాటర్, రంగులలో తడిసినా ఆందోళన అక్కర్లేదు
- వివో T4x 5జీ నుంచి రెడ్మి 15 5జీ వరకు వాటర్ ప్రూఫ్ ఫోన్లు
Waterproof Phones : మీరు మంచి వాటర్ ప్రూఫ్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ. 15వేల లోపు ధరకు అద్భుతమైన వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. హోలీ, వర్షాకాలంలో మీ ఫోన్ తడిసిపోతుందనే భయం అక్కర్లేదు. వాటర్ ప్రూఫ్ ఫోన్లలో రెడ్మి, ఒప్పో, మోటోరోలా ఫోన్లు ఈ లిస్టులో ఉన్నాయి.
వర్షం వచ్చినా, హోలీ వచ్చినా మీ ఫోన్‌ను నీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సాధారణంగా కలర్లు, వాటర్, డస్ట్ కారణంగా చాలావరకూ ఫోన్లు దెబ్బతింటాయి. కానీ, ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్లలో అలాంటి సమస్య ఉండదు. రంగులు, నీళ్లు ఏది పడినా ఫోన్ కొంచెం కూడా చెక్కుచెదరదు.
రూ. 15వేల కన్నా తక్కువ ధర ఉన్న వాటర్‌ప్రూఫ్ ఫోన్ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. ఈ ఫోన్లలోని స్ప్లాష్-రెసిస్టెంట్ డిజైన్ ఫోన్, వాటర్, హోలీ రంగుల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ, కెమెరా, పర్ఫార్మెన్స్ కారణంగా ఈవెంట్లో అద్భుతమైన సెల్ఫీలను తీసుకోవచ్చు. ఈ లిస్టులోని వివో T4x 5జీ, మోటోరోలా జీ57 పవర్ 5జీ, ఒప్పో K14x 5జీ, రియల్‌మి నార్జో 80 లైట్ 5జీ, రెడ్మి 15 5జీ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ల ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
వివో T4x 5G :
వివో T4x 5జీ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ నీళ్లు, తేలికపాటి వర్షం, హోలీ రంగులను కూడా తట్టుకోగలదు. ఇందులో 3 కెమెరాలు ఉన్నాయి. 8MP ఫ్రంట్ కెమెరా, 50MP మెయిన్ కెమెరా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ 6500mAh కూడా ఉంది. ఈ వివో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,499కు లభిస్తోంది. మీరు బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ. 15వేల కన్నా తక్కువ ధరకు ఇంటికి తెచ్చుకోవచ్చు.
మోటోరోలా G57 పవర్ 5G :
మోటో G57 పవర్ ఫోన్ IP64 రేటింగ్ కారణంగా డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. మిలిటరీ-గ్రేడ్ (MIL-STD-810H) ఎక్కువకాలం మన్నికను అందిస్తుంది. ఈ ఫోన్లో 8MP ఫ్రంట్ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. సినిమాలు, సెల్ఫీల కోసం ఫోన్లో 7000mAh బ్యాటరీ కూడా ఉంది. అమెజాన్‌లో ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 14,047కు లభిస్తుంది.
ఒప్పో K14x 5G :
ఒప్పో K14x 5జీ ఫోన్ అద్భుతమైన వాటర్ ప్రూఫ్ ఫోన్. ఒప్పో ఫోన్ డిజైన్ కారణంగా హోలీ వేడుకల్లో నీళ్లలో తడిసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్నపాటి వర్షం, స్ప్లాష్‌లను కూడా తట్టుకోగలదు. ఈ ఫోన్లో 3 కెమెరాలు ఉన్నాయి. అందులో 50MP కెమెరా ఒకటి. పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ సెట్టింగ్స్ రెండూ కెమెరాలు సపోర్టు ఇస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ ఒప్పో ఫోన్ రూ. 14,999కి విక్రయిస్తోంది.
రియల్‌మి నార్జో 80 లైట్ 5జీ :
అమెజాన్ ఈ రియల్‌మి నార్జో 80 లైట్ 5జీ ఫోన్ రూ. 11,999కి విక్రయిస్తోంది. తడి చేతులతో కూడా ఈ ఫోన్ ఆపరేట్ చేయొచ్చు. రెయిన్వాటర్ స్మార్ట్ టచ్ టెక్నాలజీ స్క్రీన్‌తో టచ్ ఇంటరాక్షన్ అందిస్తుంది.
15W వైర్డు, 5W రివర్స్ వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 6,000mAh బ్యాటరీ ఉంది. ప్రైమరీ కెమెరా, 32MP GC32E2, ఆటోఫోకస్కు సపోర్టు ఇస్తుంది. పిల్ ఆకారంలో ఎల్ఈడీ ఫ్లాష్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే, రియల్‌మి ఏఐ క్లియర్ ఫేస్, ఏఐ ఇమేజింగ్ వంటి ఎడిటింగ్ ఆప్షన్ పొందవచ్చు.
రెడ్మి 15 5G :
రెడ్మి 15 5G స్మార్ట్‌ఫోన్ 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో 33W వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్లో రెండు రియర్ కెమెరాలు ఉన్నాయి. అందులో 50MP మెయిన్ లెన్స్, IP64 రేటింగ్ కారణంగా స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడినా చెక్కుచెదరదు. బ్యాంక్ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెడ్మి 15 5జీ రూ. 15,000కు ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
