New Financial Rules : మార్చి 1 నుంచి కొత్త రూల్స్, LPG గ్యాస్ నుంచి ఫాస్ట్ ట్యాగ్ వరకు కీలక మార్పులివే, సామాన్యుడి జేబుకు చిల్లే!
New Financial Rules : మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త మార్పులు సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావితం చేస్తాయి. పూర్తి వివరాలను తెలుసుకుందాం.
New Financial Rules ( Image Created by Gemini AI )
- మార్చి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్
- సామాన్య ప్రజల ఇంటి బడ్జెట్‌పై నేరుగా ప్రభావితం కావొచ్చు
- రైలు ప్రయాణం, వంట గ్యాస్ ధరలు, మొబైల్ వినియోగంపై నిబంధనలు
- రైల్వే పాత UTS యాప్ బంద్, ఫాస్ట్ ట్యాగ్ నియమాలు
- సవరించిన రిటర్న్‌లకు గడువు కొత్త రూల్ అమల్లోకి
New Financial Rules : సాధారణ పౌరులు, టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. ప్రతి నెల ప్రారంభంలో కొత్త రూల్స్ మారుతుంటాయి. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆర్థికపరమైన విషయాలతో పాటు వంట గ్యాస్ సంబంధించి అనేక మార్పులు రానున్నాయి. సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం పడనుంది.
ఈ నెలలో అదనపు ఖర్చుల భారం పెరిగే అవకాశం ఉంది. మార్చి ఒకటో తేదీ నుంచి వంట గ్యాస్ ధరలు, మొబైల్ ఫోన్ వినియోగ నిబంధనలు, రైలు ప్రయాణాలు, ఆదాయపు పన్ను, ఫాస్ట్ ట్యాగ్ నియమాలకు సంబంధించి పూర్తిగా మారనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి జేబుపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పు :
ప్రతి నెల ప్రారంభంలో LPG సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. కొత్త ధరలు అమల్లోకి వస్తుంటాయి. ఈసారి మార్చిలో కూడా LPG సిలిండర్ ధరలు మారవచ్చు. చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 1న కొత్త LPG సిలిండర్ ధరలను విడుదల చేస్తాయి. ఈ నెలలో LPG సిలిండర్ ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది చూడాలి.
CNG-PNG, ATF ధరల్లో మార్పులు :
ఎల్పీజీ సిలిండర్ల మాదిరిగానే చమురు కంపెనీలు ప్రతి నెలా CNG, PNG, ATF ధరలను సవరిస్తాయి. కొత్త ధరలను విడుదల చేస్తాయి. మార్చి 1 నుంచి వీటి ధరలు కూడా మారవచ్చు.
రైల్వే పాత UTS యాప్ బంద్ :
భారతీయ రైల్వే పాత UTS యాప్ వచ్చే నెల మార్చి 1న బంద్ కానుంది. ప్రయాణీకులు ఇకపై పాత UTS యాప్‌ను యాక్సస్ చేయలేరు. ప్రస్తుతం రైల్వే కొత్త RailOne యాప్ అందుబాటులో ఉంది. మార్చి 1 నుంచి ప్రయాణీకులు కొత్త యాప్ ద్వారా రిజర్వ్ చేయని టిక్కెట్లు, జనరల్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
సిమ్-బైండింగ్ నియమాలివే :
మార్చి 1 నుంచి మొబైల్ వినియోగదారులకు సిమ్-బైండింగ్ నియమాలు అమల్లోకి వస్తాయి. కొత్త సిమ్-బైండింగ్ నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ప్రతి వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్ అకౌంట్ యాక్టివ్ సిమ్‌కి లింక్ చేయడం తప్పనిసరి. అకౌంట్ క్రియేట్ చేయడం లేదా లింక్ చేసేందుకు ఉపయోగించే సిమ్ కార్డ్ కూడా మొబైల్ ఫోన్లో ఉండాలి.
బ్యాంకు అకౌంట్ AMB నిబంధనలు :
బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నిబంధనలు మారనున్నాయి. గతంలో అకౌంటులో ఒకే రోజు బ్యాలెన్స్ తక్కువగా ఉంటే పెనాల్టీ పడేది. అయితే, ఇప్పుడు అలా కాదు. సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) లేదా మొత్తం నెల సగటు బ్యాలెన్స్ ఆధారంగా పెనాల్టీ పడనుంది. కస్టమర్లకు రిలీఫ్ అనే చెప్పాలి. నెలలో కొన్ని రోజులు వరకు బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, మిగిలిన రోజుల్లో తగినంత బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేస్తే ఎలాంటి పెనాల్టీ పడకపోవచ్చు.
స్టాక్ బ్రోకర్ల కోసం కొత్త ‘1600’ కాలింగ్ సిరీస్ :
ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్చిలో కొత్త రూల్ తీసుకువస్తోంది. అన్ని అర్హత కలిగిన స్టాక్ బ్రోకర్లు (QSBs) 1600 నంబరింగ్ సిరీస్‌కి మారేందుకు 2026 మార్చి 15 గడువును విధించింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ల మెచ్యూరిటీ తర్వాత ఈ మార్పు వర్తించనుంది. పెట్టుబడిదారులు తమ బ్రోకర్ల నుంచి లీగల్ కాల్స్ ఈజీగా గుర్తించవచ్చు. ఈ తేదీ తర్వాత మీకు స్టాండర్డ్ 10-అంకెల మొబైల్ నంబర్ నుంచి “ఫైనాన్షియల్” కాల్ వస్తే అది స్కామ్ కావచ్చు.
సవరించిన రిటర్న్‌లకు కొత్త గడువు :
2026-27 కేంద్ర బడ్జెట్ నుంచి కొత్త రూల్ మార్చిలో అమలులోకి వస్తుంది. సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) దాఖలు చేసేందుకు గడువును అధికారికంగా మార్చి 31 వరకు పొడిగించారు. గతంలో, పన్ను చెల్లింపుదారులు తమ దాఖలులో లోపాలను సరిదిద్దుకునేందుకు డిసెంబర్ 31 వరకు మాత్రమే సమయం ఉంది. నామమాత్రపు రుసుము చెల్లించి 2025-26 డిక్లరేషన్లలో ఏవైనా తప్పులను సరిదిద్దుకుంటే ఎలాంటి పెనాల్టీలు పడవు.
ఫాస్ట్ ట్యాగ్ నియమాలు :
ఫిబ్రవరి చివరి నుంచి కార్లకు “Know Your Vehicle” (KYV) అవసరాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారికంగా నిలిపివేసింది. ఈ మార్చి నుంచి ఇప్పటికే ఉన్న FASTags ఉన్న ప్రయాణికులు కంప్లయిట్ చేస్తే తప్ప ఇకపై సాధారణ KYV వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం లేదు.
అధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు :
ఆన్లైన్ డబ్బు ట్రాన్స్ ఫర్ చేసే వారికోసం మరో సెక్యూరిటీ ఫీచర్ రాబోతుంది. మార్చి 1 నుంచి పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలకు ఇకపై 4 లేదా 6 అంకెల పిన్‌పై మాత్రమే సరిపోదు. పెద్ద లావాదేవీలకు బ్యాంకులు మల్టీ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ తప్పనిసరి. ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీ వంటి అదనపు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
