iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్ మీకోసమే, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర భారీగా తగ్గిందోచ్, ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!
iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
iPhone 17 Pro Max
- ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర తగ్గింపు, అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు
- ఈఎంఐ ఆప్షన్లతో పాటు పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆప్షన్లు
- డిస్ప్లే, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ కెమెరా ఫీచర్లు
iPhone 17 Pro Max : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మీరు కొత్త ఐఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మాక్స్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. విజయ్ సేల్స్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌పై రూ.6వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ అసలు ధర రూ.1,49,900కు లాంచ్ అయింది.
6.9-అంగుళాల ప్రోమోషన్ డిస్ప్లే, A19 ప్రో చిప్సెట్, 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్ అందిస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర :
విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ.1,47,900 కు అమ్ముడవుతోంది. అసలు ధర రూ.1,49,900 నుంచి రూ.2వేలు తగ్గింపు పొందింది. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడే కస్టమర్లు రూ.5,000 నేరుగా డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు, కస్టమర్లు ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచకోవచ్చు. 6 నెలల పాటు నెలకు రూ.23,982 నుంచి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే క్యాషీఫై సహకారంతో వెబ్సైట్లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి మీ పాత ఫోన్‌పై ఎక్కువ సేవింగ్ పొందవచ్చు.
కస్టమర్లు అదనంగా చెల్లిస్తే ఎక్స్ టెండెడ్ వారంటీ, స్క్రీన్ ప్రొటెక్షన్ మరిన్ని అదనపు సర్వీసులను కూడా పొందవచ్చు.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ప్రోమోషన్ డిస్ప్లేతో వస్తుంది. యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఉంది. ప్రాసెసింగ్ పరంగా ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొత్త A19 ప్రో ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ ఐఫోన్ 39 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని చెబుతున్నారు.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఐఫోన్ ప్రో మ్యాక్స్‌లో ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రావైడ్ లెన్స్, 4x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
వేపర్ చాంబర్ కూలింగ్‌తో కూడా వస్తుంది. ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ సిరామిక్ షీల్డ్ 2 ద్వారా వస్తుంది. iOS26 తో వస్తుంది. వినియోగదారులకు ఆపిల్ నుంచి లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
