Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర కేవలం రూ. 18వేల లోపు మాత్రమే.. డోంట్ మిస్..!

Motorola Edge 50 Fusion : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ తక్కువ ధరకే లభిస్తోంది.

Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర కేవలం రూ. 18వేల లోపు మాత్రమే.. డోంట్ మిస్..!

Motorola Edge 50 Fusion

Updated On : September 9, 2025 / 7:25 PM IST

Motorola Edge 50 Fusion : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ పై ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ధర రూ. 18వేల కన్నా తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్. ఇలాంటి ఆఫర్లు సాధారణంగా ఎక్కువ కాలం ఉండవని గుర్తుంచుకోండి. మీకు ఆసక్తి ఉంటే వెంటనే కొనేసుకోవడం బెటర్. ఈ ఆకర్షణీయమైన డీల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రూ.22,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.4వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తద్వారా ధర రూ.18,999కి తగ్గింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌ను ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Apple iPhone 16 : ఐఫోన్ 16 కన్నా తోపు ఫీచర్లతో 7 ఆండ్రాయిడ్ ఫోన్లు.. కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి..!

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7-అంగుళాల FHD+ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC, అడ్రినో 710 జీపీయూతో కలిపి పవర్ అందిస్తుంది. స్టోరేజ్ ఆప్షన్లలో 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి.

ఆప్టిక్స్ పరంగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌లో సోనీ LYTIA 700C 50MP OIS-రెడీ మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32MP కెమెరా ఉంది. ఇంకా, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.