OnePlus 16 : పవర్ఫుల్ డిస్ప్లే, 200MP పెరిస్కోప్ కెమెరాతో వన్‌ప్లస్ 16 వచ్చేస్తోంది.. హై-క్వాలిటీ ఫొటోలు తీయొచ్చు..!
OnePlus 16 : వన్‌ప్లస్ 16 ఫోన్ 200MP పెరిస్కోప్ కెమెరాతో వస్తోంది. అత్యంత పవర్ ఫుల్ డిస్ ప్లేతో ఆకట్టుకునేలా ఉంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలివే..
OnePlus 16
- హైపర్ఫార్మెన్స్ కెమెరాతో వన్‌ప్లస్ 16 రాబోతుంది
- 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు
- వన్‌ప్లస్ 15 ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది
OnePlus 16 : వన్‌ప్లస్ ఫోన్ లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ రాబోతుంది. వన్‌ప్లస్ 16 లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. కంపెనీ అనేక అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతుందని అంచనా. ప్రస్తుతానికి డిస్ప్లే, కెమెరాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
ఈ ఫోన్లో ఇప్పటివరకు అందించే హై రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉండవచ్చని అంచనా. అంతేకాదు.. కంపెనీ ఈ ఫోన్లో హై క్వాలిటీ పెరిస్కోప్ కెమెరాను కూడా అందించే అవకాశం ఉంది. ఈ వన్‌ప్లస్ 16 ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 16 కెమెరా స్పెషిఫికేషన్లు (అంచనా) :
వన్‌ప్లస్ 16 డిస్ప్లే కెమెరాకు సంబంధించి లేటెస్ట్ లీక్ బయటకు వచ్చింది. టిప్‌స్టర్ ప్రకారం.. వన్‌ప్లస్ 16 అనేది కంపెనీ హై-పెర్ఫార్మెన్స్ కెమెరా ఫోన్ కానుంది. అన్ని ఫోన్లలో హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉండవచ్చు. టిప్‌స్టర్ ప్రకారం.. కంపెనీ ఈ ఫోన్లో 185Hz డిస్ప్లేను అందించవచ్చు. నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 240Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో రావచ్చు. లేదంటే 185Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
గత వన్‌ప్లస్ 15 ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. వన్‌ప్లస్ 16లో 3x జూమ్ ఫీచర్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండవచ్చు. అంతేకాదు.. ఇందులో స్పెషల్ ఏఐ బటన్ కూడా ఉంటుందని వెల్లడైంది. ఈ ఫోన్ కెమెరా అద్భుతమైన ఫీచర్లతో రావచ్చు.
ఈ ఫోన్ డిస్ప్లే కూడా ప్రత్యేకంగా ఉండొచ్చు. ఈ ఫోన్లో ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందని అంచనా. 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేసే ఫ్లాట్ స్క్రీన్‌తో రావొచ్చు. ఈ ఫోన్ చుట్టూ సన్నని బెజెల్స్ కూడా కనిపిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్ వస్తుంది.
మోడల్ నంబర్ SM8975గా చెబుతున్నారు. క్వాల్కామ్ నెక్ట్స్ చిప్సెట్ అవుతుంది. 5GHz క్లాక్ స్పీడ్‌ను చేరుకోగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 17తో రన్ అవుతుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ ముందుగా అక్టోబర్ నెలలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
