Apple iPhone 17 Series : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కు ముందే ధర, సేల్ డేట్ లీక్.. ఫుల్ డిటెయిల్స్..!
Apple iPhone 17 Series : ఆపిల్ కొత్త ఐఫోన్ 17 రాబోతుంది. అవే డ్రాపింగ్ ఈవెంట్ ఐఫోన్లు రిలీజ్ కానున్నాయి. సేల్ డేట్ వివరాలు లీక్ అయ్యాయి.

Apple iPhone 17 Series
Apple iPhone 17 Series : మరికొద్ది గంటల్లో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 9న ఆపిల్ “అవే డ్రాపింగ్” ఈవెంట్‌లో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రొడక్టులను లాంచ్ చేయనుంది.
ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొత్తం 4 కొత్త మోడళ్లు ఉంటాయి. ఈ కొత్త సిరీస్ (Apple iPhone 17 Series) గురించి కొంత కాలంగా ప్రచారం కొనసాగుతోంది. ఇప్పుడు సేల్ తేదీ కూడా లీక్ అయింది. ఈ కొత్త ఐఫోన్లు అధికారికంగా లాంచ్ అయిన కొద్ది రోజులకే అమ్మకానికి వస్తాయని భావిస్తున్నారు.
సేల్ ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 12, 2025న ప్రారంభమవుతాయి. అధికారిక సేల్ సెప్టెంబర్ 19న ప్రారంభమవుతుంది. గత ఏడాదిలో ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 9, 2024న లాంచ్ కాగా ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 12, 2024న ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 19, 2024న సేల్ ప్రారంభం మాదిరిగానే ఆపిల్ ఈసారి కూడా గత ఏడాది రిలీజ్ షెడ్యూల్‌ను రిపీట్ చేయనున్నట్లు కనిపిస్తోంది.
ఆపిల్ ఈవెంట్ 2025 :
ఆపిల్ “అవే డ్రాపింగ్” ఈవెంట్ సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. కొత్త ఐఫోన్‌లతో పాటు ఈవెంట్ iOS26 రోల్ అవుట్‌తో పాటు నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ వాచ్, వాచ్ అల్ట్రాను కూడా ప్రవేశపెట్టనున్నట్టు భావిస్తున్నారు.
అన్ని ఐఫోన్ 17 మోడళ్ల ధరలు (అంచనా) :
ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడళ్ల ధరలు ఇటీవల లీక్ అయ్యాయి. కొత్త సిరీస్ గత ఏడాదిలో మోడళ్ల కన్నా దాదాపు 50 డాలర్లు (సుమారు రూ. 4వేలు) ఎక్కువ ఖరీదైనది కావచ్చు.
ఐఫోన్ 17 : రూ. 84,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం.
ఐఫోన్ 17 ఎయిర్ : రూ. 1,09,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం.
ఐఫోన్ 17 ప్రో : రూ. 1,24,900 నుంచి ఉండే అవకాశం.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ : రూ. 1,64,900 నుంచి ఉండొచ్చు.
కొత్త ఐఫోన్ సిరీస్‌లో స్టోరేజీ, ప్రాసెసర్, కెమెరా సామర్థ్యాలలో అప్‌గ్రేడ్‌లు ఉండొచ్చు.