Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 బర్డ్ డీల్స్.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!
Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సందర్భంగా టాప్ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Billion Days 2025
Flipkart Big Billion Days 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు 24 గంటల ముందుగానే యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్ కు ముందు, ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 9, ఐఫోన్ 16 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S24 మరిన్నింటితో సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
సాధారణ ధర తగ్గింపుతో పాటు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సేల్ సమయంలో (Flipkart Big Billion Days 2025) బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. రాబోయే సేల్‌లో మీరు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని బెస్ట్ డీల్స్ పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ మొదట రూ. 79,999 ధరతో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సందర్భంగా రూ. 40వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుందని అంచనా. గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ రూ. 40వేల కన్నా తక్కువ ధరకు లభించవచ్చు. అయితే, కచ్చితమైన ధర ఇంకా వెల్లడించలేదు.
ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 పూతతో 6.3-అంగుళాల యాక్టువా OLED డిస్ ప్లే, టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో టెన్సర్ G4 SoC, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ పిక్సెల్ 9లో 10.5MP సెల్ఫీ షూటర్ కూడా ఉంది.
ఐఫోన్ 16 ప్రో :
ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గనుంది. రూ. 1,19,900 కు లాంచ్ అయిన ఈ ఐఫోన్ 16ప్రో ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌లో రూ. లక్ష లోపు అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఈ ఐఫోన్ తగ్గింపు ధరకు అందించే అవకాశం ఉంది.
మీరు ఐఫోన్ 16 ప్రో కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాన్స్.. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.3-అంగుళాల LTPO OLED డిస్ ప్లే, ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్, 48MP ప్రైమరీ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ :
ఈ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా భారత మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్ రూ. 40వేల కన్నా తక్కువ ధరకు లభ్యం కానుంది.
ముఖ్యంగా, శాంసంగ్ మొదట్లో భారత మార్కెట్లో ఎక్సినోస్ 2400SoCతో గెలాక్సీ S24 లాంచ్ చేసింది. అయితే, ఏడాదిన్నర తర్వాత కంపెనీ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 వేరియంట్‌ను తగ్గింపు ధరకు అందించనుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,999 ధరకు లిస్ట్ అయింది.
నథింగ్ ఫోన్ 3 :
నథింగ్ ఫోన్ 3 లాంచ్ ధర రూ.79,999 ఉండగా, ఫ్లిప్‌కార్ట్ BBD సేల్ సమయంలో భారీ ధర తగ్గింపు పొందనుంది. ఈ బ్రాండ్ ఇంకా తగ్గింపు ధరను వెల్లడించలేదు. రాబోయే సేల్‌లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్‌లలో ఇదొకటిగా ఉండొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4, 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.