Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం..
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.

Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ గెలుపొందారు. దేశ 17వ వైస్ ప్రెసిడెంట్ గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.
152 ఓట్ల మెజారిటీతో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో 15 చెల్లుబాటు కాలేదు. సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.