Monalisa Bhosle : మోనాలిసా లవ్ స్టోరీ తెలుసా.. జస్ట్ ఆరు నెలల ప్రేమ.. ఇప్పుడు లేచిపోయి పెళ్లి..
మోనాలిసా నిన్న కేరళలో తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. (Monalisa Bhosle)
Monalisa Bhosle
Monalisa Bhosle : కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా వైరల్ అయింది మోనాలిసా. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెని తీసుకొచ్చి హీరోయిన్ ని చేసారు కానీ సనోజ్ మిశ్రాపై పలు ఆరోపణలు చేసి జైలుకు పంపడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మోనాలిసా హిందీలో, తెలుగులో రెండు సినిమాలు హీరోయిన్ గా ఓకే చేసింది.
తాజాగా మోనాలిసా నిన్న కేరళలో తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. వాళ్ళింట్లో వాళ్లకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకుని కేరళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. పెళ్లి తర్వాత మోనాలిసా, ఆమె బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ అక్కడ మీడియాతో మాట్లాడారు.
Also Read : Monalsia : మోనాలిసా ది ప్రేమ వివాహం కాదు.. లవ్ జీహాద్.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మోనాలిసా లవ్ స్టోరీ.. మోనాలిసా హీరోయిన్ గా అనుకున్న సినిమాలో ఫర్మాన్ ఖాన్ ని నటుడిగా ఒక పాత్రకు తీసుకున్నారు. అక్కడ వీరిద్దరికి పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త క్లోజ్ గా మారి ప్రేమ అయింది. ఆరు నెలలు ప్రేమించుకున్నారు. మొదట మోనాలిసానే అతనికి ప్రపోజ్ చేసింది.
మోనాలిసా ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఫర్మాన్ తో కలిసి కేరళ వచ్చి అక్కడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఓ గుడిలో దండాలు మార్చుకున్నారు. ఇక ప్రేమించుకున్నది ఆరు నెలలే అయినా 60 ఏళ్ల ప్రేమతో సమానం అని ఫర్మాన్ తెలిపాడు. ఇతనితో ప్రేమ, పెళ్లి ఆనందంగా ఉంది అని మోనాలిసా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ జంట వైరల్ అవుతుంది. మరి మున్ముందు మోనాలిసా హీరోయిన్ గా సినిమాలు చేస్తుందా లేదా చూడాలి.
Also Read : Radhika Sarathkumar : టికెట్ రేట్లపై మాట్లాడుతూ.. స్టార్ హీరోలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాధికా శరత్ కుమార్..
