Suryakumar Yadav : అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. కోపంగా ఉండడంతో..
టీ20 ప్రపంచకప్ 2026లో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.
Suryakumar Yadav Apologised To Axar Patel For Benching Him During T20 World Cup
- ప్రపంచకప్‌లో పలు మ్యాచ్‌ల్లో అక్షర్‌పటేల్‌కు నో ఛాన్స్
- క్షమాపణలు చెప్పిన సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన మూడో భారత కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ రికార్డులకు ఎక్కాడు. అతడి కంటే ముందు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలు భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌లను అందించారు.
కాగా.. టీ20 ప్రపంచకప్ 2026లో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అక్షర్ పటేల్, సంజూ శాంసన్‌లను పక్కన పెట్టాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్‌తో జరిగిన సంభాషణను సంబంధించిన విషయాన్ని తాజాగా సూర్య వెల్లడించాడు.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో పాటు కీలకమైన దక్షిణాప్రికాతో మ్యాచ్‌కు పక్కడ పెట్టడంతో అక్షర్ పటేల్ చాలా బాధపడ్డాడని, కోపంగా ఉన్నాడని సూర్య తెలిపాడు. అతడిని పక్కన పెట్టడానికి గల కారణాలు చెప్పడంతో పాటు తనను క్షమించాలని అడిగినట్లు వెల్లడించాడు.
‘అక్షర్ అనుభవజ్ఞుడైన ఆటగాడు, ఫ్రాంచైజీని నడిపిస్తాడు. దక్షిణాసియా మ్యాచ్ కోసం వదిలిపెట్టిన తరువాత కోపంగా ఉన్నాడు. నేను క్షమాపణలు చెప్పాను. నేను తప్పు చేశానని, నన్ను క్షమించండి అని అడిగాను. కానీ అది జట్టు కోసం తీసుకున్న నిర్ణయం. ఇది కఠినమైన సంభాషణ. అతను దానిని తన ధైర్యంగా తీసుకున్నాడు. మేము మరుసటి రోజు దాని గురించి మాట్లాడుకున్నాము.’ అని సూర్య తెలిపాడు.
ఆ తరువాత తుది జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడంతో పాటు ఫీల్డింగ్ మెరుపులతో భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
