Vice President Election 2025: ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్..
క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

Vice President Election 2025: ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్డీయే కూటమి నుంచి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధనఖడ్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవి కోసం అధికార ఎన్డీయే కూటమి, విపక్షాల మధ్య పోటీ నెలకొంది.
ఎన్డీయే కూటమి తరఫున సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు వ్యక్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన ‘ఎఫ్-101 వసుధ’ పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. ప్రధాని మోదీ ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగింది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన గంట తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి రాత్రికల్లా ఫలితాన్ని ప్రకటించనున్నారు.
Also Read: భారతీయుల జోలికెళ్లొద్దు.. వెంటనే క్షమాపణ చెప్పండి.. సెనెటర్‌కు ఆస్ట్రేలియా ప్రధాని వార్నింగ్