Grace Antony : 9 ఏళ్ళ ప్రేమ.. మ్యూజిక్ డైరెక్టర్ ని నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్..
మలయాళ నటి గ్రేస్ ఆంటోనీ తన ప్రేమికుడు మ్యూజిక్ డైరెక్టర్ అబి టామ్ ని నిశ్చితార్థం చేసుకుంది.(Grace Antony)

మలయాళం హీరోయిన్ గ్రేస్ ఆంటోనీ తాజాగా తన ప్రేమికుడ్ని నిశ్చితార్థం చేసుకుంది. కేరళకు చెందిన గ్రేస్ ఆంటోనీ 2016 లో హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

కుంబలంగి నైట్స్, కనకం కామిని కలహం, వివేకానంద వైరల్, నాగేంద్రన్ హానిమూన్స్.. లాంటి పలు మలయాళ సినిమాలు, సిరీస్ లలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది గ్రేస్ ఆంటోనీ. 9 ఏళ్లుగా గ్రేస్ ఆంటోనీ మలయాళ సినీ పరిశ్రమకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ అబి టామ్ సీరియక్ తో ప్రేమలో ఉంది.

తాజాగా గ్రేస్ ఆంటోనీ అబి టామ్ తో నిశ్చితార్థం చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి 9 ఏళ్ళ తర్వాత అంటూ ఈ విషయాన్ని తెలిపింది. అబి టామ్ ఇప్పుడిప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతున్నాడు. పలు సినిమాలకు, షార్ట్ ఫిలిమ్స్ కు, మ్యూజిక్ ఆల్బమ్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

గ్రేస్ ఆంటోనీ మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. పలువురు నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.