Dheera Reddy : ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో హీరోయిన్ చెల్లి.. చివర్లో కనిపించిన క్యూట్ అమ్మాయి ఈమెనే.. ఫొటోలు..
మౌళి తనూజ్, శివాని జంటగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ చెల్లెలిగా కాసేపు క్యూట్ గా కనిపించి అందర్నీ ఫిదా చేసింది నటి ధీర రెడ్డి. 2018 మిస్ తెలంగాణ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది ధీర. క్లాసికల్ డ్యాన్సర్, మోడల్, నటి అయిన ఈమె ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు తెచ్చుకుంటుంది. లిటిల్ హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.














