LPG Surrender : కేంద్రం సంచలనం.. వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి.. ఆర్డర్స్ పాస్..
LPG Surrender : గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారందరూ గ్యాస్ సిలిండర్స్ తిరిగి ఇవ్వాల్సిందే అని తెలిపింది.
Govt asks households with with PNG connections to surrender domestic LPG
LPG Surrender : దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శనివారం ఒక ప్రకటన చేసింది. పీఎన్జీతో పాటు ఎల్పీజీ కనెక్షన్ కూడా ఉంటే.. ఆ వినియోగదారులు వెంటనే తమ ఎల్పీజీ కనెక్షన్ను తక్షణమే సరెండర్ చేయాలని సూచించింది. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు, వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ (LPG) సిలిండర్ రీఫిల్ తీసుకోవద్దని కూడా సూచించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు పీఎన్జీ (PNG) వినియోగదారులు కొత్తగా డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవడాన్ని కూడా నిషేధించారు.
శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇలా పేర్కొన్నారు: “పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి, అదే సమయంలో డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ను కొనసాగించకూడదు. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి లేదా వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ కూడా తీసుకోకూడదు. అలాంటి వారు తమ ఎల్పీజీ కనెక్షన్ను వెంటనే సరెండర్ చేయాలి.”
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల మీద పడుతోంది. ఇప్పటికే చాలా హోటళ్లు అధిక గ్యాస్ వినియోగించుకునే వంటలను మెనూ నుంచి తొలగించాయి.
