Tamilisai Soundararajan : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారా? తమిళిసై ఏమన్నారంటే..

బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.

Tamilisai Soundararajan : తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. తెలంగాణ ప్రజలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ తెలంగాణలో 22 సార్లు పర్యటించారని, ఎక్కువ శాతం అబివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్-బీజేపీ మధ్యే అని ఆమె అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో బీజేపీకి పోటీ ఉందన్నారు.

”బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని పర్యటనకు సీఎం రాలేదు. గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వలేదు. బీఆర్ఎస్ గురించి ప్రజలకు తెలుసు. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ రిజర్వేషన్ల మీద అసత్యపు ప్రచారం చేసి కుల మతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు. రిజర్వేషన్ల ఎత్తివేత అంశంపై ఇప్పటికే ప్రధాని, హోంమంత్రి, ఆర్ఎస్ఎస్ పెద్దలు వివరణ ఇచ్చారు.

దేశాన్ని 50ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలించింది. మండల్ కమిషన్ తెచ్చింది ఎవరు? కుల రిజర్వేషన్లు వ్యతిరేకించింది కాంగ్రెస్. బీజేపీ నుంచి అత్యధిక ఎస్సీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రుణమాఫీ ఎలా చేస్తారు? అంత రెవెన్యూ ఎక్కడిది? స్పష్టత లేదు. కాంగ్రెస్ కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అసత్యపు హామీలు ఇచ్చింది.

మా ప్రధాని అభ్యర్థి మోడీ. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? మోడీ దేశానికి ప్రధాని గుజరాత్ కి కాదు. మహిళల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు తీసుకొచ్చింది. మహిళలంతా మోడీ వెంటే ఉన్నారు. హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేసే ఆలోచన లేదు. కేటీఆర్ ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. సౌత్ చెన్నైలో గెలుస్తాను. తమిళనాడులో బూత్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేశాం” అని తమిళిసై తెలిపారు.

Also Read : నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తి లేదు- కేసీఆర్

ట్రెండింగ్ వార్తలు