Balloon Blast: గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో పేలుడు కలకలం.. నలుగురికి గాయాలు
నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Representative Image (Image Credit To Original Source)
Balloon Blast: హైదరాబాద్ గచ్చిబౌలిలో పేలుడు కలకలం రేగింది. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ లో హీలియం గ్యాస్ బెలూన్ పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో హోలీ ఈవెంట్ లో అడ్వర్ టైజ్ మెంట్ బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే, ఆ బెలూన్ గాలికి ఎగురుతూ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలోకి వచ్చింది. తమ ప్రాంగణంలో పడ్డ ఆ బెలూన్ ని తీయడానికి బ్రహ్మకుమారిస్ వాలంటీర్లు ప్రయత్నించారు. బెలూన్ తీసే క్రమంలో అకస్మాత్తుగా అది పేలిపోయింది. దీంతో నలుగురు వాలంటీర్లు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఇండియాపై యుద్ధం ఎఫెక్ట్.. గ్యాస్ ఆపేసిన ఖతార్.. రేట్లు ఏ రేంజ్ లో పెరుగుతాయో..!
