Anniyan Hindi Remake: అపరిచితుడు దర్శక, నిర్మాతల లీగల్ ఫైట్.. తగ్గేదెవరో?

ఇప్పుడు అన్నియన్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రీమేక్ మీద ప్రకటన కూడా ఇచ్చేయగా.. అసలు ఒరిజినల్ అన్నియన్ దర్శక, నిర్మాతల మధ్య లీగల్ ఫైట్ మొదలైంది. రణవీర్ రీమేక్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ‘అన్నియన్’ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ పేరు మీద లీగల్ నోటీసులు జారీ చేశాడు.

Anniyan Hindi Remake: అపరిచితుడు సినిమా మన దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రెమో, రామానుజం, అపరిచితుడుగా మూడు పాత్రలలో చియాన్ విక్రమ్ నటనకు దక్షణాది ప్రజలు ఫిదా అయిపోయారు. ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరున్న శంకర్ ఎంచుకునే కాన్సెప్ట్, తెరకెక్కించిన విధానం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతుంటుంది. ఇప్పుడు టీవీలో వచ్చినా భారీ టీఆర్పీలు దక్కించుకునే ఈ సినిమా ఒరిజినల్ అన్నియన్ తమిళ్ సినిమా. తెలుగులో అపరిచితుడుగా డబ్బింగ్ చేయగా ఆ సినిమాతో విక్రమ్ తెలుగులో మార్కెట్ సొంతం చేసుకోగా.. హీరోయిన్ సదా బిజీ స్టార్ గా మారింది.

కాగా, ఇప్పుడు అన్నియన్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రీమేక్ మీద ప్రకటన కూడా ఇచ్చేయగా.. అసలు ఒరిజినల్ అన్నియన్ దర్శక, నిర్మాతల మధ్య లీగల్ ఫైట్ మొదలైంది. రణవీర్ రీమేక్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ‘అన్నియన్’ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ పేరు మీద లీగల్ నోటీసులు జారీ చేశాడు. ‘అన్నియన్’ కథకు సంబంధించిన అన్ని హక్కులు నిర్మాతగా తనకే చెందుతాయని.. తన వద్దే ఉన్నాయని హక్కులు ఉన్నాయని.. దర్శకుడు ఎలా వాడుకుంటారని నోటీసులు ఇచ్చారు.

Read : Jr NTR Viral Pic: బాలరాముడిగా బుల్లి రామయ్య.. మరోసారి ఫోటో వైరల్!

అంతేకాదు.. అసలు అన్నియన్ కథను రాసిన సుజాత అనే రచయిత నుండి తానే హక్కులు కొన్నానని, తన అనుమతులు లేకుండా రీమేక్ ఎలా అనౌన్స్ చేస్తారని నోటీసులతో పేర్కొన్నాడు. తక్షణమే రీమేక్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిర్మాత నోటీసులపై స్పందించిన దర్శకుడు శంకర్ లేఖ రూపంలో రవిచంద్రన్ కు సమాధానమిచ్చారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై శంకర్ అనే ట్యాగ్ మీదనే విడుదలైన సినిమా ‘అన్నియన్’ కథ మీద సర్వ హక్కులు తనవేనని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

నిర్మాతగా మీరు లాభాలు తెచ్చుకున్న అన్నియన్ సినిమా కథ, పాత్రలు పూర్తిగా తన సృష్టి అని, అందులో ఇంకెవరి ప్రమేయమూ లేదన్నారు. అంతేకాదు రచయిత లేట్ సుజాత కథలో ఇన్వాల్వ్ కాలేదని, ఆయన కథకు మాటలు మాత్రమే రాశారని, తన కథను ఏమైనా చేసుకునే హక్కు తనకు ఉందని లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ రీమేక్ వివాదం సంచలనంగా మారింది. మరోవైపు శంకర్ వెర్షన్ చూస్తుంటే ఆయన వెనకడుగు వేసే ఉద్దేశ్యం లేనట్లుగా కనిపిస్తుంది. రవిచంద్రన్, శంకర్ అక్కడ ఇండస్ట్రీలో లెజెండ్స్ కావడంతో ఈ వివాదాన్ని తీర్చే ధైర్యం ఎవరు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

Read : Balakrishna Upcoming Film: మళ్ళీ వేటపాలెంలో వేట మొదలెట్టిన దర్శకుడు!

ట్రెండింగ్ వార్తలు