Best Foods in Summer: వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలివే!

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యుని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.

Best Foods in Summer: వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యుని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. మండుతున్న ఎండలలో మన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే, మన శరీరం లోపల నుంచి చల్లగా ఉండాలి. అందుకోసం ఎక్కువ నీటిని తాగడం, పండ్ల రసాలను సేవించడం లాంటివి చేస్తూ ఉండడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. అసలు మన దేహం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే.. వేసవి వలన డీహైడ్రేట్ అయిన మన శరీరాన్ని మళ్ళీ రీ హైడ్రేషన్ చేసుకోవడానికి కొన్ని ఆహార పదార్ధాలను తీసుకుంటే మంచిది. వాటిలో ఓ ఆరు ఆహార పదార్ధాలను ఇప్పుడు ఇక్కడ చూద్దాం..

1. Coconut water

Best Foods In Summer1

కొబ్బరి బొండం గొప్ప పోషకాలను కలిగిన సహజ పానీయమని, దీనిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెపుతుంటారు. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి వేసవిలో చెమట ఎక్కువగా పట్టి ఫ్లూయిడ్స్ తొలగి పోతుంటాయి. కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల తిరిగి ఫ్లూయిడ్స్ అందుతాయి. అందుకే వేసవికాలంలో ప్రజలు కొబ్బరి బొండాన్ని విరివిగా వినియోగిస్తారు. ముఖ్యంగా శీతల పానీయాలకు బదులుగా సహజసిద్ధమైన హైడ్రేటింగ్ ఏజెంట్లకు ప్రాధాన్యతనిచ్చే వారందరూ ఈ కొబ్బరిబొండాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వ్యాధి రహితమైన జీవితాన్ని ఆస్వాదించుటకు ఉపయోగపడుతుంది.

2. Celery

Best Foods In Summer2

నీటిశాతం అధికంగా ఉండే కూరగాయల్లో సెలెరీ కూడా ఒకటి.. దీనిని జ్యూస్ లాగా చేసుకొని తాగితే చాలా మంచిది. శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఇది బాగా పనిచేస్తుంది. వేసవిలో ఇవి విరివిగా మార్కెట్లో లభిస్తాయి.

3. Cucumber

Best Foods In Summer3

వేసవిలో దోసకాయను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దోసకాయలో ముప్పావు శాతం నీరు వుంటుంది. విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కార్బోనేటేడ్‌ ద్రావణాల కన్నా, దోసకాయ తినటం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దోసకాయ తింటే చర్మ సమస్యలు, ర్యాషెస్‌ తగ్గుతాయి. ఇందులో చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. దోసకాయ ముక్కలను 20 నిమిషాల పాటు కళ్ళపై ఉంచటం వల్ల మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్‌ దోసకాయలో పుష్కలంగా వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

4. Buttermilk

Best Foods In Summer4

వేస‌విలో చ‌ల్ల చ‌ల్లగా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. చ‌ల్ల‌ని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తూకంలో ఉంటాయి. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌జ్జిగ‌లో ఉండే బ‌యోయాక్టివ్ సమ్మేళ‌నాలు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

5. Watermelon

Best Foods In Summer5

వేసవిలో కాలంలో ఎక్కువగా వేసవితాపాన్ని తీర్చే వాటిలో పుచ్చకాయ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ జ్యూసీ ఫ్రూట్ ను ఏ ఒక్కరూ మరిచిపోలేరు. ఈ కలర్ చూస్తేనేనోట్లో నీళ్ళు ఊరాల్సిందే. వేసవిలో పుచ్చకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాటితో జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు. దానిలో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవిలో తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్. వేసవిలో పుచ్చముక్కలు తినడం వలన శరీరంలో ద్రవాలు సమతుల్యంగా మారి పోషకాలు లభిస్తాయి. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చ వేసవిలో తినడం వలన శరీర ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు