SRH vs RR : రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల హంగామా చూశారా?
ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 2, 2024 / 06:25 PM IST
SRH vs RR
Sunrisers Hyderabad vs Rajasthan Royals : ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఉప్పల్ స్టేడియానికి వస్తున్నారు. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అయినప్పటికీ ఇప్పటికే స్టేడియం లోపలికి అభిమానులకు ఎంట్రీ ప్రారంభమైంది. అయితే.. చెన్నై, ముంబై, ఆర్సీబీ మ్యాచ్‌ల తరహాలో ఫ్యాన్ సందడి కనిపించడం లేదు.
ఎండ కారణంగా స్టేడియానికి నెమ్మదిగా చేరుకుంటున్నారు. మ్యాచ్ సమయానికి స్టేడియం పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఇప్పటికే మైదానానికి చేరుకున్న కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు సన్‌రైజర్స్ మరింత దగ్గర కానుంది.
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండగా సన్‌రైజర్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా.. ఈ సీజన్లో ఇరు జట్లు మొదటి సారి తలపడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో 18 సార్లు ఇరు జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. చెరో 9 సార్లు విజయాన్ని అందుకున్నాయి. అయితే.. ఉప్పల్ మైదానంలో 4 సందర్భాల్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో మూడు సార్లు గెలిచి సన్‌రైజర్స్ పై చేయిలో ఉంది. టాప్ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
