Allu Arjun Sukumar Pushpa 2 Title Song Creates New Records in You Tube
Pushpa Song : అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా దేశాన్ని ఊపేయడంతో రాబోయే పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వైరల్ అవుతుంది. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్ రాగా నిన్న ఫస్ట్ సాంగ్ పుష్ప టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప పుష్ప.. అంటూ సాగే ఈ పాట, అందులో అల్లు అర్జున్ అదిరే స్టెప్పులు.. అందరికి తెగ నచ్చేసాయి.
దీంతో పుష్ప సాంగ్ వైరల్ అవ్వగా యూట్యూబ్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. పుష్ప సినిమాకి విదేశాల్లో కూడా మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే పుష్ప సాంగ్ విదేశాల్లో కూడా ట్రెండ్ అవుతుంది. తాజాగా పుష్ప సాంగ్ రిలీజయిన 24 గంటల్లో యూట్యూబ్ లో సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాట 24 గంటల్లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతే కాక 1.27 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది.
పుష్ప మొదటి సాంగ్ తోనే వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుండటంతో బన్నీ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది.
#PushpaPushpa is most viewed lyrical video in 24 hours in India ??#Pushpa2FirstSingle is a ????????? ??????????? ?
Trending across 15 countries with ???+ ???? ???? ????? on YouTube across 6 languages ❤️?
? https://t.co/JkSnelxU5U… pic.twitter.com/OWstC6ZCYl
— Pushpa (@PushpaMovie) May 2, 2024
Pushpa gadi RULING eppudo modhalaipoindi ??
There’s nothing else to do but hail and be a spectator in his ERA ❤️?❤️?#PushpaPushpa #Pushpa2FirstSingle#Pushpa2TheRule
Icon Star @alluarjun @MythriOfficial pic.twitter.com/gZ2dIPz7H9— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 2, 2024