Baladitya : ఆ రోజు వెంకటేష్ నా ప్రాణాలు కాపాడారు.. లేకపోతే మంటల్లో..
బాలాదిత్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి సంగతులు, తను పనిచేసిన హీరోల గురించి మాట్లాడాడు. (Baladitya)
Baladitya
- బాలాదిత్య ఇంటర్వ్యూ
- వెంకటేష్ నా ప్రాణాలు కాపాడారు
- చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి సంగతి చెప్పిన బాలాదిత్య
Baladitya : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన బాలాదిత్య చిన్నప్పుడే చాలా సినిమాల్లో నటించాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసాడు. ఆ తర్వాత హీరోగా, సీరియల్స్ లో, సినిమాల్లో ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తున్నాడు. బాలాదిత్య ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, హీరోగా సీరియల్స్ చేస్తున్నాడు.
తాజాగా బాలాదిత్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి సంగతులు, తను పనిచేసిన హీరోల గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో వెంకటేష్ తన ప్రాణాలు కాపాడారు అంటూ ఓ సంఘటన గురించి తెలిపారు.
Also Read : NTR : వామ్మో ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? అందుకేనా ఇంత సన్నబడ్డాడు..
బాలాదిత్య మాట్లాడుతూ.. సూపర్ పోలీస్ సినిమాలో నేను వెంకటేష్ తో నటించా. ఆ సినిమాలో నేను జయసుధ కొడుకు పాత్ర చేశాను. ఆవిడ పాత్ర చనిపోతుంది. నేను తలకొరివి పెట్టాలి. పక్కనే వెంకటేష్ ఉన్నారు. కట్టెల మీద శవం సెటప్ ఉంది. దాన్ని తగలపెట్టాలి. దానికి మంటలు సరిగ్గా రావట్లేదని సెట్ బాయ్ ఒక్కసారిగా పెట్రోల్ పోసాడు. అది నా మీద నుంచి వెళ్ళింది. మంటలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. వెంటనే వెంకటేష్ గారు నన్ను పక్కకు లాగారు. లేకపోతే నాకు కూడా మంటలు అంటేవి. వెంకటేష్ గారు ఆ రోజు నన్ను కాపాడారు. ఈ సంఘటన నాకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది అని తెలిపారు.

Also Read : Geetu Mohandas : లేడీ డైరెక్టర్ మీద నమ్మకం లేదా? మళ్ళీ రీ షూట్స్ చేయమన్న హీరో..?
