NTR : వామ్మో ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? అందుకేనా ఇంత సన్నబడ్డాడు..
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. (NTR)
NTR
- ఎన్టీఆర్ కొత్త లుక్స్ వైరల్
- మరీ సన్నబడిన ఎన్టీఆర్
- డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ సాహసం
NTR : ఎన్టీఆర్ సినిమాలోని పాత్ర కోసం తనని తాను మార్చుకుంటాడు. కొన్నేళ్ల క్రితం రాఖీ, నా అల్లుడు.. సినిమాల సమయంలో లావుగా ఉండి కూడా సినిమాలు చేసాడు ఎన్టీఆర్. అతని లుక్స్ పై చాలా విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తనని తాను మార్చుకున్నాడు. టెంపర్ సినిమాకు పర్ఫెక్ట్ లుక్ తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఎన్టీఆర్.
టెంపర్ నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ నిదానంగా సాగుతుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్స్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.
డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడు. అసలు ఇంత సన్నగా ఉన్నాడు, పవర్ ఫుల్ పాత్ర అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చాడు. అప్పుడు మరీ సన్నగా కనపడ్డాడు. ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలు ఆ ఈవెంట్ నుంచి వైరల్ గా మారాయి.
అయితే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 18 కిలోలు తగ్గాడట. కేవలం 5 నెలలోనే పర్ఫెక్ట్ డైట్, ఎక్సర్సైజ్ తో ఎన్టీఆర్ ఈ బరువు తగ్గారట. సినిమాలో పాత్ర కోసమే ఎన్టీఆర్ ఇంత బరువు తగ్గినట్టు తెలుస్తుంది. కానీ మరీ సన్నగా అయిపోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ప్రభాస్, యశ్ లను కాస్త ఫిట్ బాడీతో పర్ఫెక్ట్ గా చూపించాడు. మరి ఎన్టీఆర్ ని ఎందుకు సన్నబడమన్నాడు, డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ ని నీల్ ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఎప్పుడు? ఎక్కడ?
ఇక ఈ సినిమాని జూన్ 25 రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు కాబట్టి వాయిదా పడే అవకాశమే ఉందని తెలుస్తుంది.

