Alekhya Tarakratna : కూతురికి పానిక్ అటాక్స్.. చిన్న పాప నాన్న లేడు అని.. పిల్లలని తలుచుకొని అలేఖ్య ఎమోషనల్..
తారక్ మరణం తర్వాత మొదటిసారి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అలేఖ్య. (Alekhya Tarakratna)
Alekhya Tarakratna
- అలేఖ్య తారకరత్న ఇంటర్వ్యూ
- పిల్లల గురించి మాట్లాడిన అలేఖ్య
- తారకరత్న గురించి చెప్తూ ఎమోషనల్
Alekhya Tarakratna : హీరో తారకరత్న 2023లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత భార్య అలేఖ్య ఎక్కువగా బయట కనిపించలేదు. తను, ముగ్గురు పిల్లలే తన జీవితం అని గడిపేస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు పెడుతుంది. తారక్ మరణం తర్వాత మొదటిసారి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అలేఖ్య.
ఈ ఇంటర్వ్యూలో అలేఖ్య అనేక విషయాలు మాట్లాడగా తన పిల్లల గురించి కూడా మాట్లాడింది. నాన్న లేరు అనే విషయాన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది. తారకరత్న – అలేఖ్య జంటకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు నిష్కా కు 12 ఏళ్ళు. ఆ తర్వాత ఇద్దరు కవలపిల్లలు. ఒక బాబు, పాప. ఇద్దరికీ ఆరేళ్ళు. పాప రేయ, బాబు తనయ్ రామ్.
Also Read : Alekhya : కుంకుమ పెట్టుకోవద్దు అన్నారు.. వెళ్లకూడదని డిసైడ్ అయ్యా.. తారకరత్న చనిపోయాక అలేఖ్య ఇబ్బందులు..
పిల్లల గురించి అలేఖ్య మాట్లాడుతూ.. వాళ్ళు ఎప్పుడూ ఓబు(తారకరత్న)ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. నిష్క కు పానిక్ అటాక్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు తండ్రిని తలుచుకొని. రోజూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక నిష్క ఆయన ఫోటోని హగ్ చేసుకుంటుంది. ఆయన లేకపోయినా ఉత్తరాలు రాసి ఆ ఫోటో దగ్గర పెడుతుంది. ఓబు చదువుతాడని చెప్తుంది. నిష్క మాట్లాడటానికి ఇష్టపడకపోయినా రోజూ తలుచుకుంటుంది.
చిన్న పిల్లలు ఇద్దరూ కూడా గుర్తు చేసుకుంటారు. స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ కి అందరికి అమ్మానాన్నలు వస్తే, నేను ఒక్కదాన్నే వెళ్తే రెయా నాన్న లేడు అని అడుగుతుంది అని చెప్తూ ఎమోషనల్ అయింది.
Also Read : Alekhya Tarakratna : మా ప్రేమని ఒప్పుకోలేదు.. కనీసం పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి.. అలేఖ్య ఎమోషనల్..
