CM Revanth Reddy : స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు.
CM Revanth Reddy Dussehra celebrations
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలోని తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. భారీగా హాజరైన ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం రేవంత్ ముందుకెళ్లారు.
గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత గ్రామస్తులను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలవనున్నారు. సాయంత్రం కొండారెడ్డిపల్లిలో జరిగే జమ్మిపూజలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొండారెడ్డిపల్లిలో సందడి వాతావరణం నెలకొంది.
