Jithender Reddy Trailer : ఎన్నికల ముందు సంచలన బయోపిక్.. ‘జితేందర్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా..
తాజాగా జితేందర్ రెడ్డి సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు.

Rakesh Varre Virinchi Varma Jithender Reddy Movie Trailer Released
Jithender Reddy Trailer : 1980 కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా, ప్రజానాయకుడు జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నటుడు రాకేష్ వర్రె.. జితేందర్ రెడ్డి పాత్ర చేస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : SSMB 29 Update : రాజమౌళి మహేష్ సినిమా అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇప్పటికే జితేందర్ రెడ్డి సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, ఓ రెండు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ట్రైలర్ లో.. చిన్నప్పట్నుంచి నాయకుడు కావాలనుకుంటారు జితేందర్ రెడ్డి. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడతాడు. నక్సలైట్లకు జితేందర్ రెడ్డి మధ్య పెద్ద యుద్ధమే జరిగినట్లు చూపించారు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉండటం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ జితేందర్ రెడ్డితో మాట్లాడినట్టు చూపించారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి.
ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఎన్నికల సమయంలో పొలిటికల్ అంశాలు ఉన్న బయోపిక్ రావడం, అందులో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉండటంతో జితేందర్ రెడ్డి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మే 10న రిలీజ్ కాబోతుంది.