SSMB 29 Update : రాజమౌళి మహేష్ సినిమా అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన KL నారాయణ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడారు.

Producer KL Narayana Comments on Rajamouli Mahesh Babu Movie SSMB 29 Updtae
SSMB 29 Update : రాజమౌళి(Rajamouli) మహేష్ బాబు(Mahesh Babu) సినిమా కోసం అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఓ పక్క రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తుంటే మరో పక్క మహేష్ ఈ సినిమాకి కావలసినట్టు లుక్ రెడీ చేసుకుంటున్నాడు. దీంతో ఇటీవల మహేష్ బాబు బయట కనిపిస్తే SSMB29 లుక్స్ అంటూ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అంతా ఎదురుచూస్తున్నారు. త్వరగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ అభిమానులు రోజూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన KL నారాయణ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడారు. KL నారాయణ మాట్లాడుతూ.. RRR తర్వాత రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ ఇచ్చినా వెళ్ళలేదు. నాకు పదిహేనేళ్ల క్రితం సినిమా తీస్తానని చెప్పారు. మహేష్ బాబుతో సినిమా అప్పుడే అనుకున్నాం. ఇప్పుడు అయన మాట నిలబెట్టుకుంటూ సినిమా తీస్తున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా రాజమౌళి నాకు చెప్తారు. మహేష్ సినిమాకు కావాల్సిన లుక్ కోసం రెడీ అవుతున్నాడు. షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మొదలవుతుందని తెలిపారు.
దీంతో నిర్మాత KL నారాయణ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అప్డేట్ ఇచ్చారని ఆనందపడాలా ఇంకా సెప్టెంబర్ దాకా కూడా షూటింగ్ మొదలవ్వదని బాధపడాలా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇటీవలే ఓ పెళ్ళిలో నిర్మాత KL నారాయణ, మహేష్ బాబు కలిసి ముచ్చటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి అసలు సినిమా మొదలుపెట్టకుండానే SSMB29 పై భారీ అంచనాలు ఉన్నాయి.