Losing Weight Suddenly : అకస్మాత్తుగా బరువు కోల్పోతున్నారా? ఇలా ఎందుకు జరుగుతుందో ఏమైనా తెలుసా?

వ్యాధులు కలిగి ఉంటే వారు తాత్కాలికంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం, క్యాన్సర్, మధుమేహం, క్షయవ్యాధి. వీటివల్ల అకస్మాత్తుగా బరువు తగ్గినట్లు తెలుస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ డిమెన్షియా వంటి కారణాల వల్ల అకస్మాత్తుగా తమ బరువును ఎక్కువగా కోల్పోతారు.

Losing Weight Suddenly : బరువు పెరగడం వంటి సమస్యలను ఇటీవలి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది ఎంత తింటున్నా ఏమాత్రం బరువు పెరగకపోగా తగ్గిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు ఎందుకు తగ్గుతున్నారో చెక్ చేసుకోవాల్సి న అవసరం ఉంది.  అకస్మాత్తుగా బరువు తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

బరువు అకస్మాత్తుగా తగ్గడం కూడా అనారోగ్య సమస్యే. శరీరంలో ఏదైనా సమస్యల వల్ల ఇలా జరగవచ్చు. ఫ్యామిలీలో ఎవరైనా బక్కపలచని వారు వుండివున్నట్లయితే వారి లక్షణాలు వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు సహజంగా సన్నగా, తక్కువ బీఎంఐ కలిగి ఉండే జన్యువులతో పుడతారు. కనుక అలాంటి వారు ఎంత తిన్నప్పటికీ లావుగా కనిపించరు.

వ్యాధులు కలిగి ఉంటే వారు తాత్కాలికంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం, క్యాన్సర్, మధుమేహం, క్షయవ్యాధి. వీటివల్ల అకస్మాత్తుగా బరువు తగ్గినట్లు తెలుస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ డిమెన్షియా వంటి కారణాల వల్ల అకస్మాత్తుగా తమ బరువును ఎక్కువగా కోల్పోతారు. బరువు తగ్గడానికి మరో ముఖ్య కారణం ఒత్తిడి. దీనివల్ల హార్మోన్ల నిర్మాణంపై తీప్ర ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లక్షణాలు కూడా బరువు తగ్గడానికి కారణమవుతాయి

డిప్రెషన్ ఉన్న వ్యక్తులు ఆకలి లేకుండా వుంటారు. ఇలాంటి వారు త్వరగా బరువు కోల్పోతారు. అలాంటి వారికి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించటం మంచిది. కిడ్నీ, లివర్ సమస్యలు, మద్యపానం, డ్రగ్స్ వినియోగం, కడుపులో అల్సర్లు, ఉదర సమస్యలు కూడా మనిషి అకస్మాత్తుగా బరువు తగ్గడానికి కారణమవుతాయి.

ఆహారంలో గానీ, వ్యాయామ దినచర్యల్లో ఎలాంటి మార్పులు చేయకుండా అకస్మాత్తుగా బరువు తగ్గుతుంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం ద్వారా అసలు కారణాలను తెలుసుకుని తగిని చికిత్స పొందటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు