CM Revanth Reddy : చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించండి : రేవంత్ రెడ్డి

మే 13న ఫైనల్స్ జరగబోతున్నాయని, తెలంగాణ వర్సెస్ గుజరాత్ పోరు ఉంటుందన్నారు. గుజరాత్ టీమ్ వైపు మోదీ.. తెలంగాణ టీమ్ వైపు మీ రేవంతన్న ఉన్నాడని అన్నారు.

CM Revanth Reddy : వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శంషాబాద్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన చేవెళ్లను అభివృద్ధి చేసే బాధ్యత మాదన్నారు. డిసెంబర్‌లో జరిగినవి సెమీ ఫైనల్స్ మాత్రమేనని సీఎం చెప్పారు.

Read Also : Amit Shah Comments : దేశంలో రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు.. ఇది మోదీ గ్యారంటీ : అమిత్ షా

మే 13న ఫైనల్స్ జరగబోతున్నాయని, తెలంగాణ వర్సెస్ గుజరాత్ పోరు ఉంటుందన్నారు. గుజరాత్ టీమ్ వైపు మోదీ.. తెలంగాణ టీమ్ వైపు మీ రేవంతన్న ఉన్నాడని అన్నారు. గుజరాత్‌ను డక్ ఔట్ చేసి తెలంగాణ టీమ్‌ను గెలిపించాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మోసానికి, విశ్వాసానికి పోటీ, నమ్మకానికి, నమ్మక ద్రోహానికి పోటీ, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి పోటీ జరుగనుందని తెలిపారు.

అది కొండైనా.. బండైనా పిండి చేస్తాం :
విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోదీ మోసం చేశారని రేవంత్ విమర్శించారు. బీజేపీ నుంచి కొండను బరిలోకి దించామని మాట్లాడుతున్నారని, అది కొండైనా.. బండైనా.. మా కార్యకర్తలు పిండి పిండి చేస్తారని చెప్పారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ మనకు పది పైసలు ఇవ్వలేదంటూ దుయ్యబట్టారు. అలాంటిది మరి ఇవాళ ఓట్లు ఎలా అడుగుతారని రేవంత్ ప్రశ్నించారు. అయోధ్య రాముడి ప్రతిష్టకు 15 రోజుల ముందే బీజేపీ నేతలు తలంబ్రాలు పంచారని, రేషన్ బియ్యంలో పసుపు కలిపి మన ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

కారు కార్ఖానాకు.. ఇక సరాసరి తూకానికే :
దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని ధ్వజమెత్తారు. పదేళ్లు బీజేపీ మోసం చూశారు.. బీఆర్ఎస్ దోపిడీ చూశారన్న రేవంత్ ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు మనల్ని మోసం చేయడానికే వస్తారని మండిపడ్డారు. కారు కార్ఖానాకు పోయింది.. ఇక సరాసరి తూకానికేనని విమర్శించారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కిండంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Read Also : Kangana Ranaut : పాపం కంగనా రనౌత్‌.. పేరుతో తికమక.. సొంత పార్టీ నేతనే తిట్టిపోసింది!

ట్రెండింగ్ వార్తలు