YouTuber Vaishnavi : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం.. సంచలన నిజాలు వెల్లడించిన పోలీసులు
YouTuber Vaishnavi : తెలంగాణలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
jagtial youtuber vaishnavi murder case police arrest her husband and send to remand
YouTuber Vaishnavi : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదనపు వరకట్నం కోసమే భర్త హరిబాబు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం నాడు హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… భర్త చేతిలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి అని తెలిపారు. అదనపు కట్నం కోసం జరిగిన గొడవ కాస్త పెద్దదై.. చివరకు వైష్ణవి దారుణ హత్యకు దారితీసిందని వెల్లడించారు.
వైష్ణవి స్వస్థలం.. జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామం. సంవత్సరం క్రితం ఆమెకు కోరుట్ల అయ్యప్ప గుట్టకు చెందిన హరిబాబుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. అయితే హరిబాబు తల్లిదండ్రులు వీరి వివాహాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో వీరు వైష్ణవి పుట్టింటి వద్దనే ఉంటున్నారు. ఈ జంట ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. సుమారు 48 వేల సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో హరిబాబు ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి.
వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల కట్నం రాలేదని హరిబాబు కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లి, అన్నల సూచనలతో తరచూ అదనపు కట్నం కోసం వైష్ణవిని భర్త హరిబాబు వేధించేవాడు. అదనపు కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ కాస్త హత్యకు దారితీసింది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి హరిబాబు.. గర్భవతి అనే జాలి కూడా లేకుండా వైష్ణవిని దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు.
మంగళవారం తెల్లవారేసరికి ఇంట్లో అచేతనంగా పడి ఉన్న వైష్ణవిని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న హరిబాబును మంగళవారం రాత్రి కోరుట్ల శివారులో అరెస్ట్ చేశారు. హత్య చేయడానికి ప్రేరేపించిన తల్లిదండ్రులు, అన్నలపై కూడా కేసు నమోదు చేశారు. నిందితుడు హరిబాబును రిమాండ్కు తరలించారు.
