Kangana Ranaut : పాపం కంగనా రనౌత్‌.. పేరుతో తికమక.. సొంత పార్టీ నేతనే తిట్టిపోసింది!

‘తేజస్వీ’ మొదటి పదం ఒకేలా ఉండటంతో గందరగోళానికి గురైన కంగనా రనౌత్ బీజేపీ నేత తేజస్వీ సూర్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కంగనా చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్‌ కూడా కౌంటర్ ఎటాక్ చేసింది.

Kangana Ranaut : ప్రముఖ బాలీవుడ్‌ నటి, బీజేపీ నేత కంగనా రనౌత్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తడబడ్డారు. ప్రత్యర్థి పార్టీ నేత అయిన తేజస్వీ యాదవ్‌ను టార్గెట్ చేయబోయి సొంత పార్టీ నేత తేజస్వీ సూర్యపైనే కంగనా విమర్శలు చేశారు. ఆ ఇద్దరు నేతల పేరులో ‘తేజస్వీ’ మొదటి పదం ఒకేలా ఉండటంతో ఆమె తికమక పడ్డారు. దాంతో గందరగోళానికి గురైన కంగనా బీజేపీ నేత తేజస్వీ సూర్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read Also : Amit Shah Comments : దేశంలో రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు.. ఇది మోదీ గ్యారంటీ : అమిత్ షా

హిమాచల్‌ప్రదేశ్‌లో మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ బరిలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ర్యాలీలో కంగనా రనౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ సహా ఇతర పార్టీలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ‘‘అక్కడో అవినీతిపరుల పార్టీ ఒకటి ఉంది.

చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలనుకునే రాహుల్‌ గాంధీ, గూండాయిజం చేసి.. చేపలు తినే తేజస్వీ సూర్య ఇందులో ఉన్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ బదులుగా బీజేపీ నేత తేజస్వీ సూర్య పేరును తప్పుగా ప్రస్తావించి కంగనా ఆరోపణలు చేశారు. ఇటీవల తేజస్వి యాదవ్ చేపలు తింటున్నట్లు కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోపై స్పందించిన బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు సూర్య యాదవ్ లక్ష్యంగా విమర్శలు చేశాయి. కంగనా కూడా కాంగ్రెస్ నేత టార్గెట్‌గా విమర్శలు చేయాలని భావించింది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బీజేపీ లోక్‌సభ అభ్యర్థి తేజస్వీ సూర్య పేరును పొరపాటున తప్పుగా ప్రస్తావించింది.

కంగనా చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్‌ కూడా కౌంటర్ ఎటాక్ చేసింది. ఆమె విమర్శలు చేసిన వీడియోను ఎక్స్ వేదికగా షేర్‌ చేసిన తేజస్వీ యాదవ్‌.. ఈ మహిళ ఎవరు? (యే మొహతర్మా కౌన్ హై?) అంటూ ఎద్దేవా చేశారు. ముందుగా తన పార్టీ నేతల గురించి వాస్తవాలను తెలుసుకుని రాజవంశ రాజకీయాల గురించి మాట్లాడాలని 37 ఏళ్ల కంగనాపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. మండి నుంచి బీజేపీ ఎంపీగా పోటీచేయడంపై ఆమెకు ఉన్న అర్హతలను కాంగ్రెస్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అమృత్ కౌర్ ప్రశ్నించారు.

Read Also : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అంటే ఏంటి? దీనిపై రచ్చ దేనికి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు