Eggplant Garden : వంగతోటలో మొవ్వ కాయతొలుచు పురుగు నివారణ

నారును మడి నుండి ప్రధాన పొలంలో నాటే ముందుగా నారును రైనాక్సిపైర్ 18.5ఎస్.సి 5మి.లీ లీటరు నీటిలో మూడు గంటలు ముంచి తరువాత నాటుకోవాలి. ఈ పురుగు ఆశించిన మొదటి దశలోనే కొమ్మలను తుంచి కాల్చివేయాలి. లింగాకర్షక బుట్టలను ప్రధాన పొలంలో 100 ఎరలు లేదా హెక్టారుకు 10మీ ఎడంలో వెదురు కట్టెలకు అమర్చితే తల్లి పురుగులు ఎరకు ఆకర్షించబడి బుట్టలో పడిచనిపోతాయి.

Eggplant Garden : వంగతోటల్లో మొవ్వకాయ తొలుచు పురుగు పంటకు తీవ్రనష్టాన్ని కలుగ జేస్తుంది. మొక్కలు పెరిగే వయస్సులో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలచి వేస్తుంది. కాయలు ఒక్కోసారి వంకర తిరిగి ఉంటాయి. వంకాయ మొక్కల మొవ్వు భాగం వాలిపోయి కాయలపై రంధ్రాల్లో పిల్ల పురుగులు విసర్జించడాన్ని గమనించి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు. ఒక్కో పిల్ల పురుగు సుమారు 6 కాయలకు నష్టం కలిగిస్తుంది.

నారును మడి నుండి ప్రధాన పొలంలో నాటే ముందుగా నారును రైనాక్సిపైర్ 18.5ఎస్.సి 5మి.లీ లీటరు నీటిలో మూడు గంటలు ముంచి తరువాత నాటుకోవాలి. ఈ పురుగు ఆశించిన మొదటి దశలోనే కొమ్మలను తుంచి కాల్చివేయాలి. లింగాకర్షక బుట్టలను ప్రధాన పొలంలో 100 ఎరలు లేదా హెక్టారుకు 10మీ ఎడంలో వెదురు కట్టెలకు అమర్చితే తల్లి పురుగులు ఎరకు ఆకర్షించబడి బుట్టలో పడిచనిపోతాయి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ బదనికలను పూత సమయంలో ట్రైకోకార్డులను పొలంలో ఆకుల అడుగు భాగంలో అమర్చుకోవాలి. ఇవి పెట్టినప్పుడు వేపనూనె 5మి.లీ, లేదా బీటీ సంబంధిత మందులు 500గ్రా హెక్టారుకు పిచికారి చేయాలి.

ఈ పురుగు నివారించుకోవటానికి క్లోరాంట్రానలిప్రోల్ 18.5 ఎస్.సి 0.4మి.లీ లేదా ఎమామెక్టిమ్ బెంజోయేట్ 5 ఇ.జి. 0.4గ్రా. లేదా ల్యాండా సైహలోత్రిన్ 5 ఇ.సి 0.6మి.లీ, లేదా థయోడికార్బ్ 75డబ్ల్యు.పి. 2గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

 

ట్రెండింగ్ వార్తలు