చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు రావు.. మళ్లీ ప్రజలను మోసం చేస్తాడు : సీఎం జగన్

ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి.

CM Jagan : ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. శుక్రవారం నరసాపురంలో రోడ్ షోలో భాగంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకొస్తుందా? ఆయన హయాంలో ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా? రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు సంక్షేమ పథకాలను ఎన్నడైనా అమలు చేశాడా? అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు రావు.. మళ్లీ ప్రజలను మోసం చేస్తాడని విమర్శించారు.

Also Read : గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేసింది నేనే.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని

అక్క చెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తం, మహిళా సాధికారత, రైతులకు 9గంటలు విద్యుత్, రైతు భరోసా వైసీపీ ప్రభుత్వం అందించింది . పేదవాడికి రూ. 25లక్షల ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణ రక్షణ కల్పించింది. చంద్రబాబు ఏ పేదవాడికి మంచి చెయ్యలేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలు ఏమీ అమలు కాలేదని జగన్ అన్నారు. కూటమి మ్యానిఫెస్టో అంటూ ప్రజలను మోసం చేయడానికి కొత్త మ్యానిఫెస్టోను పెట్టారు.. ప్రజలు వాళ్లను నమ్మొద్దు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదవాడికి ఎలాంటి న్యాయం జరగదని జగన్ అన్నారు. నర్సాపురంలో టీడీపీ అభివృద్ధి ఏమన్నా చేసిందా అంటూ జగన్ ప్రశ్నించారు.

Also Read : నా కుటుంబంలో చిచ్చు పెట్టారు.. కూతురు వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ

ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్ జరుగుతుంది. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 పార్లమెంట్ సీట్లు గెలవాల్సిందే. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలంటూ జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు