గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చేసింది నేనే.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని
చంద్రబాబు అమరావతిలో ఎయిర్ పోర్టు కడతానని అన్నారు. నేను ఒప్పించి గన్నవరం ఎయిర్ పోర్టు కావాలని అడ్డంతిరిగి మాట్లాడాను. గన్నవరంలో ఉన్న రైతులతో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నాం. గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి చేసింది నేనే.

Keshineni Nani
Kesineni Nani : విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. పదేళ్ల నుండి ప్రజలకోసం పనిచేస్తున్నా.. ఇప్పటికీ ఎప్పటికీ విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం అని కేశినేని నాని అన్నారు. 2014 సంవత్సరంకు ముందు విజయవాడ ఎలాఉంది.. నేను ఎంపీ అయిన తరువాత ఎలా ఉందో అందరికీ తెలుసు. నేను ఎంపీ అయిన తరువాతనే బెంజి సర్కిల్ వద్ద రెండు ప్లై ఓవర్లు నిర్మించా. దుర్గగుడి వద్ద ప్లై ఓవర్ నిర్మించడం అసాధ్యం అన్నారు. నేను సుసాధ్యం చేసి చూపించా. విజయవాడ – మచిలీపట్నం బైపాస్ తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని నాని చెప్పారు.
Also Read : నా కుటుంబంలో చిచ్చు పెట్టారు.. కూతురు వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ
ఆ పనులన్నీ నేను చేసినవే..
చంద్రబాబు అమరావతిలో ఎయిర్ పోర్టు కడతానని అన్నారు. నేను ఒప్పించి గన్నవరం ఎయిర్ పోర్టు కావాలని అడ్డంతిరిగి మాట్లాడాను. గన్నవరంలో ఉన్న రైతులతో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నాం. గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి చేసింది నేనే. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. మచిలీపట్నం నుంచి నాగపూర్ హైవే తీసుకువచ్చింది నేనే. అంతేకాకుండా విజయవాడ – నాగ్ పూర్ రోడ్డు నిర్మాణం ఒక సంవత్సరంలో పూర్తి అవుతుంది. విజయవాడ – ఢిల్లీ చాలా తక్కువ సమయంలో ఇప్పుడు వెళ్లిపోతాం. టాటా ట్రస్ట్ ద్వారా అనేక గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేశాం. అనేక గ్రామాల్లో ప్రజలు వాటర్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటర్ ట్యాంక్ లు ఇప్పించానని కేశినేని నాని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జికొండురులో కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే పార్లమెంట్ లో ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి వారి సమస్య పరిష్కరించా. అలా చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. అనేక మంది విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. వాళ్లందరి కంటే నేను ఎక్కువ పనిచేయడం చాలా సంతోషంగా ఉందని కేశినేని నాని అన్నారు.
Also Read : Viveka murder case: కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట.. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు
చంద్రబాబు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలు..
2019లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాలంటరీలపై అనేక ఆరోపణలు చంద్రబాబు చేశారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు బేష్ అంటున్నాడు. చంద్రబాబు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే అదేదో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలు. జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధే ఆయన్ను గెలిపిస్తుంది. అది అక్షర సత్యం అని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అన్నారు.