Viveka murder case: కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట.. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు

అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే, నిరాధార ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ వేశాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.

Viveka murder case: కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట.. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు

Kadapa MP Avinash Reddy (Credit @google)

Updated On : May 3, 2024 / 11:48 AM IST

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో అవినాశ్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ముదస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశాడు. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయలేమని పేర్కొన్న హైకోర్టు.. దస్తగిరి పిటిషన్ ను కొట్టివేసింది. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. భాస్కర్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

Also Read : సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్‌పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే?

అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే, నిరాధార ఆరోపణలతో దస్తగిరి పిటిషన్ వేశాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. సీబీఐ బెయిల్ రద్దు ఎప్పుడు కోరలేదు.. హైకోర్టు కండీషన్ షరతులు ఎక్కడ ఉల్లంఘించలేదని అన్నారు. సాక్షులను బెదిరించినట్లు ఆధారాలు లేవని, అనారోగ్య కారణాలతో భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి విషయంలోసైతం ఆధారాలు లేవు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ చార్జిషీట్ వేసిందని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది తమ వాదనలు కోర్టుకు వినిపించారు. అవినాశ్ రెడ్డి వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దస్తగిరి పిటిషన్ కొట్టివేసింది.