సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్‌పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే?

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈవో నౌహీరా షేక్ కు చెందిన రూ. 75కోట్ల విలువైన ఇల్లు ..

సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్‌పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే?

Bandla Ganesh (Credit @google)

Updated On : May 3, 2024 / 11:03 AM IST

Bandla Ganesh : సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ లో హీరా గ్రూపు సీఈవో నౌహీరా షేక్ కు చెందిన రూ. 75కోట్ల విలువైన ఇల్లు కబ్జా చేసినట్లు గణేష్ పై గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నౌహీరా షేక్ ఫిలింనగర్ లోని తన ఇంటిని బండ్ల గణేశ్ కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు. కొంతకాలంగా కిరాయి ఇవ్వకపోగా గూండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Also Read : Kishori Lal Sharma : కిషోరి లాల్ శర్మ ఎవరు? అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఇతన్నే ఎందుకు ఎంపిక చేసింది..

ఫిబ్రవరి 15న ఈ ఘటన చోటుచేసుకోగా.. ఫిలింనగర్ పోలీసులకు నౌహీరా షేక్ ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు పట్టించుకోకపోగా నౌహీరా షేక్ మీదనే తిరిగి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై నౌహీరా షేక్ తాజాగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్ పై ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.