Kishori Lal Sharma : కిషోరి లాల్ శర్మ ఎవరు? అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఇతన్నే ఎందుకు ఎంపిక చేసింది..

అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాహుల్ గాంధీ 2004 నుంచి మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ ..

Kishori Lal Sharma : కిషోరి లాల్ శర్మ ఎవరు? అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఇతన్నే ఎందుకు ఎంపిక చేసింది..

Kishori Lal Sharma

Amethi Lok Sabha Constituency : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నియోజకవర్గం నుంచి కిషోరి లాల్ శర్మ పోటీ చేయనున్నారు. అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాహుల్ గాంధీ 2004 నుంచి మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. అయితే, మరో నియోజకవర్గం కేరళలోని వాయనాడ్ నుంచి పోటీచేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Also Read : సస్పెన్స్ వీడింది..! రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ

2024 ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ వాయనాడ్, అమేథీ నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. వాయనాడ్ నుంచి పోటీచేస్తున్న రాహుల్.. రెండో నియోజకవర్గం అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అమేథీ స్థానం నుంచి కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. అయితే, అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కిషోరి లాల్ శర్మ ఎవరు? కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఆయన్నే కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఎంపిక చేసిందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేఎల్ శర్మ సోనియాగాంధీకి అత్యంత సన్నిహిత నాయకుడిగా గుర్తింపు పొందారు. పంజాబ్ లోని లూథియానాకు చెందిన కేఎల్ శర్మ.. చాలాకాలం రాయ్ బరేలీలో సోనియా గాంధీ ఎంపీ ప్రతినిధిగా పనిచేస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమేథీ – రాయ్ బరేలీలో పార్టీీ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్న శర్మకు ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రతీ కాంగ్రెస్ నాయకుడితో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. రాజీవ్ గాంధీ కాలంలో ప్రభుత్వంకు సహకారిగా కేఎల్ శర్మను యూపీకి అప్పటి కాంగ్రెస్ అధిష్టానం పంపించింది. అప్పటి నుంచి అతను అక్కడే ఉన్నారు. గత ఇరవై ఏళ్లుగా గాంధీ కుటుంబం అమేథీ, రాయ్ బరేలీలలో ప్రచార బాధ్యతలను కిషోరీ లాల్ శర్మనే చూసుకుంటున్నారు. 2004లో రాహుల్ గాంధీ తొలిసారిగా అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పుడు అక్కడ కేఎల్ శర్మ ఉన్నారు. ఇరవైఏళ్లు తరువాత రాహుల్ గాంధీ స్థానంలో అదే అమేథీ నియోజకవర్గం నుంచి కేఎల్ శర్మ పోటీ చేస్తున్నాడు.

Also Read : హమ్మయ్య చిరుత చిక్కింది..! శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత

మరోవైపు రాహుల్ గాంధీ ప్రస్తుతం పోటీ చేస్తున్న రాయ్ బరేలీ కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. సోనియాగాంధీ 2004 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నంచి తప్పుకున్నారు. రాజ్యసభకు వెళ్లారు. సోనియాగాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 1999లో తొలిసారి ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.