Pak-IndiaT-20 : పాక్-ఇండియా మ్యాచ్..భారత్ ఓటమికి పండుగ చేసుకున్న భార్య‌..కేసు పెట్టిన భ‌ర్త‌

T-20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ గెలుపుకు సంబరాలు చేసుకున్న భార్యపై పోలీసు కేసు పెట్టాడు భర్త.

man FIR against wife for celebrating Pakistan’s win : అక్టోబర్ 24న జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ప్రియులే కాదు భారతీయులంతా చాలా చాలా బాధపడిపోయారు. కానీ భారత్ లో కొంతమంది మాత్రం పాక్ చేతిలో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు. క్రాకర్స్ కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. యూపీలోని ఓ ముస్లిం కుటుంబం బాణసంచా కాల్చి మరీ సంబరాలు చేసుకుంది. పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమిని సంతోషం వ్యక్తం చేస్తు ఓకుటుంబానికి చెందిన మహిళ సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయం ఆమె భర్తకు నచ్చలేదు.దీంతో భార్యపైనా అత్తమామలపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత‌డు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు స్థానిక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more : T20 World Cup 2021: టీమిండియా మరీ ఇంత చెత్త ప్రదర్శన.. ఓటమి కాదిది ఘోర పరాభవం

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో షంగన్‌ఖేడాలో నివసిస్తున్న ఇషాన్ మియాన్ అనే ముస్లిం వ్యక్తి టీమిండియా అభిమాని. ఆయ‌న భార్య‌ రబియా షంషీ మాత్రం పాక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతోంది. భారత్ ఓటమితో ఆమె సంబరపడిపోయింది. అంతటితో ఊరుకోకుండా క్రాకర్స్ కాల్చి మరీ సంతోషం వ్యక్తంచేసింది. భారత్ జట్టును ఎగతాళి చేసింది. దీంతో ఇషాన్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. పాక్ గెలిచిందంటూ అంబ‌రాన్నంటే సంతోషం వ్య‌క్తం చేస్తూ వాట్సప్ స్టేటస్‌లోనూ పెట్టుకున్నారు. వారి తీరు ఇషాన్‌కు మండిపోయింది. భార్యపైనా అత్తమామలపైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more : Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!

ఇషాన్ మియా ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153-A మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం, 2008లోని సెక్షన్ 67 కింద రాంపూర్ జిల్లాలోని గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కాగా ఇషాన్ మియా భార్యతో విభేదించి విడిగా ఉంటున్నట్లుగా సమాచారం. భార్య రబియా షంషీ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈక్రమంలో టీమిండియా పాకిస్థాన్ చేతిలో ఓడిపోవటంతో బాణసంచా కాల్చి సెలబ్రేట్ చేసుకుంది రబియా తన తల్లిదండ్రులతో కలిసి. దాన్ని వాట్సాప్ లో పెట్టారు. అది చూసిన ఇషాన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారిపై కేసు నమోదు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు