Revanth Reddy: అందుకే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి: రేవంత్ రెడ్డి

కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కాలని, ఆయనను టికెట్ అడిగితే కాంగ్రెస్ ఏమీ చేయనట్టని, అడగకపోతే కాంగ్రెస్ చేసినట్టని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని చెప్పారు. ఆలంపూర్ జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్ ఏమీ చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కాలని, ఆయనను టికెట్ అడిగితే కాంగ్రెస్ ఏమీ చేయనట్టని, అడగకపోతే కాంగ్రెస్ చేసినట్టని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మహిళలు, హిజ్రాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 9 లోగా రైతు భరోసాను పూర్తిస్థాయిలో చెల్లిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. తాము సెమీఫైనల్స్‌లో (తెలంగాణ ఎన్నికల్లో) కేసీఆర్ ను ఓడించామని అన్నారు. అలాగే, ఫైనల్స్‌లో (లోక్‌సభ ఎన్నికల్లో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించాలని అన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏమీ లేదని చెప్పారు. మల్లు రవిని లక్ష మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

Also Read: దేశంలో రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు.. ఇది మోదీ గ్యారంటీ : అమిత్ షా

ట్రెండింగ్ వార్తలు