Avoid Potassium Deficiency : పొటాషియం లోపాన్ని నివారించుకునేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవటం బెటర్!

శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం రోజువారిగా తీసుకునే ఆహారాల నుంచే శరీరానికి కావాల్సిన పొటాషియం లభిస్తుంది.

Avoid Potassium Deficiency : మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడుతుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలు రాకుండా పొటాషియం తోడ్పడుతుంది. శరీరంలో పొటాషియం లోపిస్తే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

దీనిలోపం కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అలసట, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం, ఆకలి లేకపోవడం, మానసిక కుంగుబాటు, హైపోకలేమియా, వాంతులు, విరేచనాలు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. మలంలో రక్తం కూడా వస్తుంది. పొటాషియం శ‌రీరానికి కావాల్సిన స్థాయిలో అందితే గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం త‌క్కువ‌గా ఉంటుంది.

శరీరంలో పొటాషియం లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం రోజువారిగా తీసుకునే ఆహారాల నుంచే శరీరానికి కావాల్సిన పొటాషియం లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.

పొటాషియం లోపాన్ని నివారించుకునేందుకు కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, నట్స్, అరటి పండ్లు, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్‌రూట్‌ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది. కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపాన్ని నివారించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు