Train stuck in traffic India : ట్రాఫిక్ జామ్. నగర వాసులకు ఇది ప్రతీరోజు ఉండే సమస్యే. బైక్ మీద వెళ్లినా, కారుమీద వెళ్లినా, ఆటోలో వెళ్లినా, ఆఖరికి సైకిల్ మీద వెళ్లినా నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పవనే విషయం తెలిసిందే. ట్రాఫిక్ జాబ్ లో చిక్కుకోవటం అనేది సర్వసాధారణమే అనే విషయం నగరవాసులకు అలవాటైపోయిన పనిగా మారిపోయింది. కానీ ట్రైన్ కూడా ట్రాఫిక్ జాబ్ లో చిక్కుకుంది. ఏంటీ షాక్ అయ్యారా..? అయ్యే ఉంటార్లెండీ..ట్రైన్ ట్రాఫిక్ జాబ్ లో చిక్కుకోవటమేంటీ..? అనేది ఓ సరదాకు చెప్పేమాట కాదు నిజంగానే జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని బనారస్ లో చోటుచేసుకుంది ఈ విచిత్రమైన ఘటన. బనారస్ లోని రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రైలు వస్తున్నా జనాలు ఎవ్వరు పట్టించుకోనట్లుగా తమ తమ వాహనాలను రైల్వే ట్రాక్ పై పోనిస్తునే ఉన్నారు. దీంతో లోకోపైలట్ మొత్తుకున్నా వాహనదారులు మాత్రం తాపీగా తమ వాహనాలు ట్రాక్ దాటిస్తునే ఉన్నారు. దీంతో లోకోపైలట్ రైలునే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక్కడి రైల్వే గేటు ఎత్తివేయడంతో ఇటువైపు నుంచి అటువైపు నుంచి వాహనాలు వెళ్లడం ప్రారంభం అయింది. దీంతో రైలు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇక అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన సాధ్యం కాలేదు. అదన్నమాట భారత్ లో రైళ్లకు కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పవు అనటానికి ఇదో ఉదాహరణగా చెప్పుకోవాలి..రైలు కూడా ట్రాఫిక్ జాబ్ లో చిక్కుకున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ట్రాఫిక్ లో చిక్కుకుని విలవిల్లాడుతున్న వైరల్ వీడియోపై..