IPL 2025: లక్నో జైత్రయాత్రకు చెన్నై బ్రేక్.. ఉత్కంఠ పోరులో సీఎస్కే విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

Courtesy BCCI

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18లో లక్నో సూపర్ జెయింట్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. లక్నోపై సీఎస్కే గెలుపొందింది. వరుసగా 5 ఓటముల తర్వాత చెన్నై కమ్ బ్యాక్ చేసింది. 5 వికెట్ల తేడాతో లక్నోని చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల టార్గెట్ ను చెన్నై మరో 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. శివమ్ దూబే 43 పరుగులు, రచిన్ రవీంద్ర 37 పరుగులు, రషీద్ 27 పరుగులు, ధోని 26 పరుగులతో రాణించారు.

Also Read : పాకిస్తాన్ లో అంతే.. సెంచరీ కొట్టిన ప్లేయర్ కి హెయిర్ డ్రైయ్యర్ గిఫ్ట్.. ‘నెక్ట్స్ షేవింగ్ జెల్, షాంపూనా?‘

ఈ సీజన్ లో చెన్నైకి ఇది రెండో గెలుపు. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన సీఎస్కే.. ఐదింటిలో ఓడిపోయింది. వరుసగా 5 పరాజయాలు చూసిన తర్వాత ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. అటు లక్నో ఈ సీజన్ లో ఏడు మ్యాచులు ఆడగా.. మూడింటిలో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న లక్నోకి చెన్నై షాక్ ఇచ్చింది. పాయింట్ల టేబుల్ లో చెన్నై పదో స్థానంలో ఉంది. లక్నో జట్టు నాలుగో ప్లేస్ లో ఉంది.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here