పాకిస్తాన్ లో అంతే.. సెంచరీ కొట్టిన ప్లేయర్ కి హెయిర్ డ్రైయ్యర్ గిఫ్ట్.. ‘నెక్ట్స్ షేవింగ్ జెల్, షాంపూనా?‘

పీఎస్ఎల్‌లో సెంచ‌రీ కొట్టిన ఓ ఆట‌గాడికి ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ఇచ్చిన బ‌హుమ‌తి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

పాకిస్తాన్ లో అంతే.. సెంచరీ కొట్టిన ప్లేయర్ కి హెయిర్ డ్రైయ్యర్ గిఫ్ట్.. ‘నెక్ట్స్ షేవింగ్ జెల్, షాంపూనా?‘

James Vince receives hair dryer for Player of the Match winning century in PSL 2025

Updated On : April 14, 2025 / 3:14 PM IST

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వ‌హిస్తున్న ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌)కు పోటీగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)ను నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో గొప్ప లీగ్ అని ఆదేశ మాజీ క్రికెట‌ర్లు ఎన్నో గొప్ప‌లు చెబుతూ ఉంటారు. అయితే.. వాస్త‌వం అందుకు భిన్నం అన్న సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు.

పీఎస్ఎల్ 2025 సీజ‌న్ ఏప్రిల్ 11 ప్రారంభ‌మైంది. అయితే.. ప్రేక్ష‌కుల‌ను ఆద‌ర‌ణ అంతంత మాత్రంగానే ఉంది. ఈ సంగ‌తి ప‌క్క‌నుంచితే పీఎస్ఎల్‌లో సెంచ‌రీ కొట్టిన ఓ ఆట‌గాడికి ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ఇచ్చిన బ‌హుమ‌తి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇలాంటి గిఫ్ట్ ఎవ‌రైనా ఇస్తారా? దీని కంటే గ‌ల్లీ క్రికెట్‌లో ఇంకా మంచి ప్రైజ్‌లు ఇస్తార‌ని కామెంట్లు పెడుతున్నారు.

DC vs MI : ఓట‌మి బాధ‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ బీసీసీఐ బిగ్ షాక్..

పీఎస్ఎల్‌లో భాగంగా ఏప్రిల్ 12న క‌రాచీ కింగ్స్‌, ముల్తాన్ సుల్తాన్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ సెంచ‌రీ (63 బంతుల్లో 105 ప‌రుగులు) చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 234 ప‌రుగులు చేసింది.

అనంత‌రం జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101 ప‌రుగులు) శ‌త‌కంతో చెల‌రేగ‌గా, ఖుష్దిల్ (37 బంతుల్లో 60 ప‌రుగులు) మెరుపులు మెరిపించ‌గా.. ల‌క్ష్యాన్ని క‌రాచీ కింగ్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. దీంతో క‌రాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. క‌రాచీ కింగ్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన జేమ్స్ విన్స్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేసిన అంపైర్‌.. ఏంద‌ప్పా ఇదీ..

ఇక డ్రెస్సింగ్ రూమ్‌లో అత‌డికి మ‌రో అవార్డు వ‌చ్చింది. ‘రిలయబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అంటూ గిఫ్ట్ ఇచ్చారు. కరాచీ కింగ్స్ యాజ‌మాన్యం ఓ హెయిర్ డ్ర‌య‌ర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. పైగా ఈ వీడియోను క‌రాచీ కింగ్స్ త‌మ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. త‌రువాత మ్యాచ్‌ల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తే.. షాంపులు, షేవింగ్ క్రీమ్‌లు ఇస్తారేమోన‌ని కొంద‌రు ఎద్దేవా చేస్తున్నారు.