Hardik Pandya : హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేసిన అంపైర్‌.. ఏంద‌ప్పా ఇదీ..

ఆన్ ఫీల్డ్ అంపైర్ ముంబై కెప్టెన్ పాండ్యా బ్యాట్‌ను చెక్ చేశారు.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా బ్యాట్ చెక్ చేసిన అంపైర్‌.. ఏంద‌ప్పా ఇదీ..

Courtesy BCCI

Updated On : April 14, 2025 / 11:10 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ్యాచ్‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవ‌రెట్లుగా ఉన్న జ‌ట్లు అనూహ్యంగా త‌డ‌బ‌డుతుండ‌గా, అస‌లు ఏ మాత్రం అంచ‌నాలు లేని జ‌ట్లు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాయి. కాగా.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ సీజ‌న్ లో అంపైర్లు ప్లేయ‌ర్ల బ్యాట్ల‌ను త‌నిఖీ చేస్తున్నారు.

ఆదివారం జ‌రిగిన‌ డ‌బుల్ హెడ‌ర్ మ్యాచ్‌లో ఈ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఢిల్లీక్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్ ముంబై కెప్టెన్ పాండ్యా బ్యాట్‌ను చెక్ చేశారు.

ఈ మ్యాచ్‌లో పాండ్యా బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో అంపైర్ అత‌డి బ్యాట్‌ను ప‌రీక్షించాడు. బ్యాట్‌ను కొలిచేందుకు ఓ ప‌రిక‌రాన్ని ఉప‌యోగించారు. అదృష్ట‌వ‌శాత్తు.. పాండ్యా బ్యాట్ అనుమతించబడిన పరిమాణం 4.25 అంగుళాల లోపల ఉంది.

ఈ మ్యాచ్ క‌న్నా ముందు జ‌రిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్‌లోనూ ఫిల్ సాల్ట్‌, షిమ్రాన్ హెట్‌మైయ‌ర్ బ్యాట్‌ల‌ను ఆన్ ఫీల్డ్ అంపైర్లు ప‌రీక్షించారు.

బ్యాట్ల‌ను ప‌రిశీలించేందుకు అంపైర్ ఒక గేజ్‌ని ఉపయోస్తున్నారు. బ్యాట్ మొత్తం పొడవునా గేజ్‌ని తీసుకువెలుతున్నారు. అది ఏ సమయంలోనూ కొలతలు దాటలేదని నిర్ధారించుకుంటున్నారు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఓ బ్యాట‌ర్ బ్యాట్ 4.25 అంగుళాలు లేదా 10.8 సెంటీమీటర్ల వెడల్పును మించకూడదు.

బ్యాట్ యొక్క బ్లేడ్ కింది కొలతలు ఈ ప‌రిమితుల‌కు లోబ‌డి ఉండాలి.. వెడల్పు: 4.25in / 10.8 cm, లోతు: 2.64in / 6.7 cm, అంచులు: 1.56in / 4.0cm. ఇంకా ఆ బ్యాట్ గేజ్ గుండా కూడా వెళ్ళగలగాలి.