Denduluru Assembly Constituency: దెందులూరులో వైసీపీ హవాకు చింతమనేని చెక్ పెడతారా?

దెందులూరు.. ఏలూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు.. ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. దెందులూరు పాలిటిక్స్ కమ్మగా ఉంటూ కాక పుట్టిస్తాయ్.

Denduluru Assembly Constituency: ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట.. తర్వాత పసుపు కోటగా మారిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌తో.. దెందులూరులో ఎగిరే జెండా రంగు మారిపోయింది. టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్.. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక ఓటమిపాలయ్యారు. ఏలూరులో హాట్ కేకు లాంటి ఈ సీటులో.. ఈసారి రాజకీయం మరింత కాక రేపుతోంది. మరి.. దెందులూరులో వైసీపీ హవాకు చింతమనేని చెక్ పెడతారా? లేక.. మళ్లీ ఫ్యానే గిర్రున తిరుగుతుందా? దెందులూరు సెగ్మెంట్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

దెందులూరు.. ఏలూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు.. ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. దెందులూరు పాలిటిక్స్ కమ్మగా ఉంటూ కాక పుట్టిస్తాయ్. తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. దెందులూరు ఎక్కువగా వార్తల్లో ఉండేది. ఇందుకు.. వివాదాలు, విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో.. ఫుల్ హీట్ మీద ఉండేది ఈ సెగ్మెంట్. ఇప్పటికీ.. అదే వాతావరణం ఉన్నా.. రాజకీయంగా కాస్త టెంపరేచర్ తగ్గింది. ఊరమాస్ డైలాగులతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే.. అదే స్థాయిలో తిప్పికొడుతూ.. ముందుకు సాగుతున్నారు వైసీపీ నేతలు. ఇక.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. దెందులూరు రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది.

దెందులూరు (Denduluru) అంటే.. గోదావరి జిల్లాలతో పాటు ఏపీ మొత్తం స్పెషల్ క్రేజ్ కనిపిస్తుంది. ఇక్కడ.. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే.. ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ ఉంటారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే.. 14 సార్లు కమ్మ సామాజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారంటే.. వాళ్ల ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. కమ్మ కమ్యూనిటీకి కేరాఫ్ అడ్రస్ దెందులూరు అని చెప్పొచ్చు. ఏలూరు పట్టణానికి నలువైపులా వ్యాపించి ఉన్న ఈ నియోజకవర్గంలో.. 4 మండలాలున్నాయ్. అవి.. దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్. మొత్తం.. 2 లక్షల 20 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో.. ఒక్కసారి తప్ప.. మిగతా అన్ని సార్లు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ.. ఇక్కడ కమ్మ వాళ్ల ఓట్ బ్యాంక్ తక్కువగానే ఉంది. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్లే.. ఇక్కడ మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న ఓటర్లు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్‌ని.. తెలుగుదేశం వైపు టర్న్ చేశారు.. చింతమనేని ప్రభాకర్. 2009, 2014లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ.. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో.. దెందులూరులో ఫ్యాన్ పార్టీ జెండా ఎగిరింది. కొఠారు అబ్బయ్య చౌదరిపై చింతమనేని ఓటమిపాలయ్యారు.


అబ్బయ్య చౌదరికే వైసీపీ టికెట్

వైసీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సెగ్మెంట్లలో దెందులూరు ఒకటి. ఎలాగైనా.. ఇక్కడ గెలవాలని స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొఠారు రామచంద్రరావు రాజకీయ వారసుడిగా.. విదేశాల్లో స్థిరపడిన అబ్బయ్య చౌదరి (kotaru Abbaya Chowdary)ని పిలిపించి.. దెందులూరు బరిలో దించి మరీ గెలిపించారు. పైగా.. ఆయన సీఎం జగన్‌కు సన్నిహితుడు కూడా కావడం కాస్త కలిసొచ్చింది. నియోజకవర్గ ప్రజలతో పాటు యువతను కూడా ఆకట్టుకొని.. దూకుడు మీద ఉన్న చింతమనేని ప్రభాకర్‌కు కళ్లెం వేశారని చెప్పొచ్చు. 16 వేల ఓట్లకు పైగా మెజారిటీతో.. గెలిచిన అబ్బయ్య చౌదరి.. దెందులూరులో వైసీపీ జెండా ఎగరేశారు. గత ఎన్నికల్లో.. కొఠారు అబ్బయ్యకు.. 95 వేల ఓట్లు రాగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన చింతమనేనికి.. 78 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. నాలుగేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మంచి పేరు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మళ్లీ టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దెందులూరులో వైసీపీ నుంచి టికెట్ ఆశించే మరో వ్యక్తి కనిపించడం లేదు.

Also Read: రంకెలేసే రాజకీయం.. కులం చుట్టూ తిరిగే సమీకరణాలు.. ఒంగోలు రాజకీయాల్లో హోరాహోరీగా గిత్తలపోరు


మళ్లీ తామే గెలుస్తామంటున్న అబ్బయ్య

ఇంటింటికీ తిరుగుతూ.. జనంతో మరింత మమేకమవుతున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి (kotaru Abbaya Chowdary). జనం దృష్టి టీడీపీ వైపు మళ్లకుండా.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. దాదాపు 17 వందల కోట్ల రూపాయల ఖర్చుతో.. వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. ఏలూరు రూరల్ మండలంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. కొల్లేరు ప్రజల సమస్యలకు.. శాశ్వత పరిష్కారం చూపుతామంటున్నారు. రాబోయే ఎన్నికల్లోనూ.. మళ్లీ వైసీపీయే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అబ్బయ్య చౌదరి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉంటారని చెబుతున్నారు. దెందులూరులో.. వైసీపీని ఢీకొట్టే పరిస్థితులు లేవని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి.

Also Read: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?


కాన్ఫిడెంట్‌గా చింతమనేని

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సైతం.. వివిధ కార్యక్రమాలతో నిత్యం జనంలోనే ఉంటున్నారు. టీడీపీ తరఫున మళ్లీ పోటీ చేసే అభ్యర్థి.. చింతమనేనే అని పార్టీ శ్రేణులతో పాటు లోకల్ పబ్లిక్ కూడా భావిస్తున్నారు. దాంతో.. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందనే టాక్ నడుస్తోంది. పసుపు దళపతి చంద్రబాబు సైతం.. ఇదే దెందులూరులో ఇదేం కర్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు.. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని ఉద్దేశిస్తూ.. లండన్ బాబుని.. తిరిగి లండన్ పంపించేస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు. చింతమనేని కూడా దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. సమస్య ఉన్న చోటుకి వెళ్లి పోరాటం చేస్తున్నారు. దాంతో.. ఆయనకు జనంలో మంచి పేరుంది. వీలు దొరికినప్పుడల్లా.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ.. ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా సరే.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో.. ఈసారి టీడీపీ క్వీన్ స్వీప్ చేయబోతోందని.. 3 ఎంపీ స్థానాలను కూడా గెలవబోతుందని.. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంతో జనం విసిగిపోయారని.. ఎన్నికలెప్పుడొస్తాయా? ఎప్పుడు బుద్ధి చెబుదామా? అని ఎదురుచూస్తున్నారని అంటున్నారు.


చింతమనేనికి సొంత పార్టీ నేతలే కళ్లెం

మరోవైపు.. చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) దూకుడుకు కళ్లెం వేయాలని కొందరు సొంత పార్టీ నేతలే ఎదురుచూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి.. ఆయన్ని ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచన కూడా అధిష్ఠానం మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. చింతమనేని మాత్రం తాను దెందులూరు బరిలోనే దిగుతానని హైకమాండ్‌కు స్పష్టం చేసినట్లు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఈసారి విజయం తనదేనని ధీమాగా ఉన్నారు ప్రభాకర్. దెందులూరులో జనసేన విషయానికొస్తే.. ఆ పార్టీకి స్థానికంగా పెద్దగా పట్టు లేకపోయినా.. ఆ పార్టీ నేతలు ఎవరికి సపోర్ట్ చేస్తారనేదే.. ఆసక్తిగా మారింది. బీజేపీ అభ్యర్థులు.. ఇక్కడ ప్రభావం చూపడం కష్టమంటున్నారు. ఒక వేళ జనసేన పోటీలో ఉంటే.. అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. బీజేపీ నుంచి కూడా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

Also Read: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..

ఇక.. వైసీపీ మాత్రం.. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. చింతమనేని ప్రభాకర్ మాత్రం.. దెందులూరులో మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. దాంతో.. నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అనే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. దెందులూరుపై.. మాగంటి బాబు కుటుంబానికి కూడా మంచి పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశంనే కొనసాగుతుండటంతో.. నియోజవర్గంలో టీడీపీకి మరింత బలం పెరగనుంది. కానీ.. జనం ఎవరిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారన్నదే ఆసక్తిగా మారింది. అధికారమిచ్చి.. ఎవరిని అందలం ఎక్కిస్తారనేది చర్చనీయాంశమైంది. ఓవరాల్‌గా.. ఏలూరు జిల్లా (Eluru District)లో హాట్ సీటుగా ఉన్న దెందులూరు అసెంబ్లీ స్థానంలో.. ఈసారి ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు