కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కల్యాణ్ వస్తారు.. ఆ తర్వాత..: తెలంగాణ జనసేన నేతలు

పవన్ దీక్షలో ఉన్నారు కాబట్టి అభిమానులు, జనసేన కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్తున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు మాదాపూర్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టు బయల్దేరుతారు. 11 గంటల కు కొండగట్టుకు చేరుకుని గంటన్నర పాటు ఆలయంలో పూజల్లో పాల్గొంటారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వస్తారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఇవాళ జనసేన తెలంగాణ నేత సాగర్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ కల్యాణ్ మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. పవన్ దీక్షలో ఉన్నారు కాబట్టి అభిమానులు, జనసేన కార్యకర్తలు సంయమనం పాటించాలని అన్నారు.

త్వరలోనే తెలంగాణ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం పెడతారని చెప్పారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవని అన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల నేతలు జనసేనలో చేరేందుకు వస్తున్నారని తెలిపారు. త్వరలో పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

తెలంగాణ జనసేన ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన పాత కమిటీలు రద్దు చేసి త్వరలోనే పవన్ కల్యాణ్ కొత్త కమిటీలు నియమిస్తారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతం పై నెలరోజుల్లో పవన్ సమావేశం నిర్వహిస్తారని అన్నారు.

Also Read: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై కొందరు దుండగుల దాడి.. వీడియో పోస్ట్ చేసిన ఎంపీ

ట్రెండింగ్ వార్తలు