AP Government : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ వేతనాలు పెంపు.. వెంటనే అమల్లోకి..
AP Government : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లష్కర్లకు శుభవార్త చెప్పింది.
AP Government
- ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
- జలవనరుల శాఖలో ఔట్ సోర్సింగ్ లస్కర్ల వేతనాలు పెంపు
- రోజువారీ వేతనం రూ.350 నుంచి రూ.550కు పెంపు
AP Government : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లస్కర్లకు శుభవార్త చెప్పింది. వారి వేతనాలను పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సర్కార్ తాజా నిర్ణయంతో లస్కర్ల వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారికి రోజువారీగా రూ. 350 వేతనం అందుతుంది. దానిని రూ. 550లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల పెంపు వెంటనే అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖలోని సీఏడీఏ కమిషనర్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
తమ వేతనాలను పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లస్కర్లు ఇటీవల వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేతన పెంపు ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లస్కర్లకి ప్రోత్సాహం లభిస్తుంది. అదేవిధంగా, వారి జీవన స్థితి మెరుగుపడటానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లయింది.
